తొలి ఖో-ఖో ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం: పూర్తి షెడ్యూల్, ఫార్మాట్, ప్రత్యక్ష ప్రసారం వివరాలు ఇవిగో

By Mahesh Rajamoni  |  First Published Jan 9, 2025, 12:11 AM IST

Kho Kho World Cup 2025: జనవరి 13 నుండి 19 వరకు న్యూఢిల్లీలో ఖో-ఖో ప్రపంచ కప్ 2025 జ‌ర‌గ‌నుంది. ఈ దేశ‌వాళీ క్రీడ‌కు ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పెరుగుతోంది. ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ నీరజ్ చోప్రా టోర్నమెంట్‌కు తన మద్దతును ప్ర‌క‌టించారు.


Kho Kho World Cup 2025: స్పోర్ట్స్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఖో ఖో ప్రపంచ కప్ 2025 జనవరి 13 నుండి 19 వరకు దేశరాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది. ఈ క్రీడ భారతదేశంలో సాంస్కృతికంగా పాతుకుపోయి ఉండటంతో, ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. 

ఖో ఖో ప్రపంచ కప్ 2025లో భారత్ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ క్రీడను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి, అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందిన క్రీడగా మార్చడమే ఈ ఈవెంట్ ప్రధాన లక్ష్యం. ఈ టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల విభాగాలు ఉంటాయి. ఖో ఖో ప్రపంచ కప్ 2025 ప్రారంభోత్సవం జనవరి 13న జరుగుతుంది. దీని తర్వాత ఇందిరా గాంధీ స్టేడియంలో ఆతిథ్య భారత్, నేపాల్ మధ్య టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికలో జరుగుతాయి.

Latest Videos

 

𝐓𝐡𝐞 𝐟𝐢𝐫𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 𝐊𝐡𝐨 𝐊𝐡𝐨 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝟐𝟎𝟐𝟓 𝐬𝐜𝐡𝐞𝐝𝐮𝐥𝐞 𝐢𝐬 𝐨𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥𝐥𝐲 𝐨𝐮𝐭 𝐧𝐨𝐰! 🏆🔥

👆Check out all the electrifying FOP 1 matches and stay tuned for the match schedule of FOP 2 & FOP 3 💥

Catch all updates on our official… pic.twitter.com/5bmD9VZlPa

— Kho Kho World Cup India 2025 (@Kkwcindia)

ఖో ఖో ప్రపంచ కప్ 2025 ఫార్మాట్: 

 

ఖో-ఖో ప్రపంచ కప్ 2025 లో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి పరుషులు,రెండోది మహిళలు. పురుషుల టోర్నమెంట్‌లో నాలుగు గ్రూపులు ఉన్నాయి. అవి గ్రూప్ A, B, C, D.  ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. క్వార్టర్‌ఫైనల్‌తో ప్రారంభమయ్యే ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. భారత్ తరఫున టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. 

గ్రూప్ A : భారతదేశం, నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్ 
గ్రూప్ B : దక్షిణాఫ్రికా, ఘనా, అర్జెంటీనా, నెదర్లాండ్స్, ఇరాన్ 
గ్రూప్ C : బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణ కొరియా, USA, పోలాండ్ 
గ్రూప్ D: ఇంగ్లాండ్, జర్మనీ, మలేషియా, ఆస్ట్రేలియా, కెన్యా

మహిళల టోర్నీలో నాలుగు గ్రూపులు ఉంటాయి. అయితే, గ్రూప్ డిలో ఐదు జట్లు ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్, ఫైనల్‌లతో సహా మొత్తం నాలుగు గ్రూపుల నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టోర్నమెంట్‌లో నాకౌట్ దశలో ఆడతాయి. జనవరి 13న ప్రారంభ మ్యాచ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. టోర్నమెంట్ ప్రారంభ రోజున దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్ తో తొలి ఖో ఖో ప్రపంచ కప్ విజయం కోసం భారత్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. 

గ్రూప్ A : భారతదేశం, ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియా 
గ్రూప్ B : ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెన్యా, ఉగాండా, నెదర్లాండ్స్ 
గ్రూప్ C : నేపాల్, భూటాన్, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్ 
గ్రూప్ D : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పోలాండ్, పెరూ, ఇండోనేషియా

టోర్నమెంట్ గ్రూప్ దశ జనవరి 16న ముగుస్తుంది. నాకౌట్ దశ జనవరి 17న ప్రారంభమవుతుంది. పురుషుల, మహిళల జట్ల టైటిల్ పోరు జనవరి 19, ఆదివారం జరుగుతుంది. 

 

ఖో ఖో ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి? 

ఖో ఖో ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:30 గంటల వరకు కొనసాగుతాయి. 

టీవీ, OTTలో ఖో ఖో ప్రపంచ కప్‌ను ఎక్కడ చూడాలి? 

ఖో ఖో ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. OTTలో ఈవెంట్‌ను చూడాలనుకునే వారు Disney+ Hotstarలో చూడవచ్చు. 

 

ఇవి కూడా చదవండి: 

డిగ్రీ అవసరం లేదు.. 10 సూపర్ గవర్నమెంట్ జాబ్స్

 

click me!