హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంపై బ్యాడ్మింటన్ స్టార్ జ్వాల గుత్తా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంపై బ్యాడ్మింటన్ స్టార్ జ్వాల గుత్తా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అకాడమీ ఏర్పాటుకు, ఇంటికోసం స్థలం ఇస్తామని తనకు హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె అన్నది.
ఈ మేరకు ఆమె సోమవారం ట్విటర్ లో వ్యాఖ్యలు చేసింది. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు స్థలం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటికీ ఏమీ చేయలేదని ఆమె అన్నది
గతంలో తెలంగాణ అథ్లెట్లకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ప్లాట్లు ఇస్తామని ప్రకటించిందని, అందులో భాగంగానే తనకు కూడా ఇంటిస్థలం ఇస్తామని ప్రకటించిందని, కానీ ఇప్పటి వరకు అది అందలేదని చెప్పింది.
ఈ ట్వీట్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)కు ట్యాగ్ చేసింది. అయితే, కొన్ని గంటల తర్వాత జ్వాల తన ట్వీట్‌ను తొలగించింది.క్రీడాకారిణిగా చాలారోజుల క్రితమే బ్యాడ్మింటన్‌కు దూరమైన 34 ఏళ్ల జ్వాల.. గతేడాది క్రీడల మంత్రి పద్మారావును కలిసి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై చర్చించింది.