గ్రెనాడాలో ఓ బీచ్ పార్టీకి హాజరైన అండర్సన్ పీటర్స్... అండర్సన్‌పై దాడి చేసి, పడవలో నుంచి నీళ్లల్లోకి తోసి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్...
జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ అండర్సన్ పీటర్స్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గ్రేనడా దేశానికి చెందిన అండర్సన్ పీటర్స్, 2019, 2022 జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ టైటిల్స్ గెలిచాడు. ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 93.07 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన అండర్సన్ పీటర్స్, ఆ తర్వాత స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు...
తన స్వదేశం గ్రెనాడాలో ఓ బీచ్ పార్టీకి హాజరైన అండర్సన్ పీటర్స్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసి, అతన్ని పడవలో నుంచి నీళ్లల్లోకి తోసి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అసలు గొడవ ఎందుకు జరిగింది? అండర్సన్ పీటర్స్‌పై ఎందుకు దాడి చేశారు? అసలు ఏం జరిగిందనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు...
being beaten by five non-national in pic.twitter.com/NrVBJwu2t9
— Do.Biblical.Justice. (@StGeorgesDBJ)
undefined
ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన అండర్సన్ పీటర్స్, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు గ్రెనాడా పోలీసులు తెలియచేశారు. జావెలిన్ త్రో అథ్లెట్‌పై జరిగిన ఈ అమానుష దాడిని గ్రెనడా ఒలింపిక్ కమిటీ తీవ్రంగా ఖండించింది...
‘అండర్సన్ పీటర్స్‌పై దాడి అమానుష చర్య. నేషనల్ స్పోర్ట్స్ స్టార్, హీరో అయిన అండర్సన్‌పై దాడి చేసిన ఐదుగురిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. అతనిపై దాడి చేసిన వాళ్లు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు కాదని తెలిసింది.... ’ అంటూ తెలియచేసింది గ్రెనడా ఒలింపిక్ కమిటీ...
గాయం కారణంగా భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొనలేదు. పాకిస్తాన్ అథ్లెట్, జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీం, 90.18 మీటర్లు విసిరి కామన్వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణం గెలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో ఫైనల్‌లో 88.64 మీటర్ల దూరం విసిరిన అండర్సన్ పీటర్స్, రజత పతకం గెలిచాడు. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ 2022 పోటీలకు దూరమైన భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాపై సానుభూతి వ్యక్తం చేశాడు అండర్సన్ పీటర్స్.