యూరో 2020 విజేతగా ఇటలీ... మరోసారి ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కి నిరాశ... అభిమానుల ఆందోళనలు...

By Chinthakindhi Ramu  |  First Published Jul 12, 2021, 10:07 AM IST

ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో ఓడిన ఇంగ్లాండ్...

53 ఏళ్ల తర్వాత యూరోపియన్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన ఇటలీ...

ఇంగ్లాండ్‌లో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఆందోళనలు, నిరసనలు...


యూరోపియన్ ఛాంపియన్‌షిప్ 2020 విజేతగా ఇటలీ నిలిచింది. 53 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇటలీ తిరిగి యూరో కప్‌ను గెలుచుకోవడం విశేషం. లండన్‌లో జరిగిన ఫైనల్‌లో షూటౌట్‌ వరకూ సాగిన తుదిపోరులో ఇంగ్లాండ్ జట్టు చివర్లో ఒత్తిడికి గురై భారీ మూల్యం చెల్లించుకుంది.

మ్యాచ్ పూర్తి సమయం ముగిసేసరికి ఇరు జట్లు చెరో గోల్ చేసి సమంగా నిలిచాయి. అదనపు సమయం కేటాయించినా ఫలితం రాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్‌‌కు వెళ్లింది. ఇటలీ ఆరు అవకాశాల్లో మూడు గోల్స్ సాధించినా, రెండు గోల్స్ మత్రమే చేసిన ఇంగ్లాండ్ ఓటమి పాలైంది...

Latest Videos

యూరో ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓటమితో లండన్ వీధుల్లో అభిమానులు ఆందోళనలు చేశారు. బట్టలు విప్పుకుని, నగ్నంగా తిరుగుతూ ఫుట్‌బాల్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

click me!