ఒలింపిక్స్‌కి వెళ్లాక పాజిటివ్‌గా తేలితే అంతే... మార్గదర్శకాలు విడుదల చేసిన ఐఓసీ...

By Chinthakindhi Ramu  |  First Published Jul 11, 2021, 4:26 PM IST

పాజిటివ్ కేసులు నమోదుకాకుండా ఒలింపిక్స్ నిర్వహించలేమని తేల్చిసిన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ...

మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌లో పాల్గొనే అథ్లెట్స్‌కి పాజిటివ్‌గా తేలితే, వారి స్థానంలో మరొకరిని ఆడించే అవకాశం...


సాధారణంగా అయితే ఈపాటికే ఒలింపిక్స్‌ క్రీడలకు సంబంధించిన సంబరాలు మొదలైపోయేవి. అయితే కరోనా కేసుల కారణంగా టోక్యోలో ఎమర్జెన్సీ విధించడంతో ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో వేడుకలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాకుండా ఒలింపిక్స్ వేడుకలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చిసిన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ, తాజాగా మరోసారి కోవిద్ మార్గదర్శకాలు విడుదల చేసింది...

Latest Videos

undefined

మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్స్‌లో పాల్గొనే షూటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలితే, అతను/ఆమె స్థానంలో మరొకరిని ఆడించేందుకు అవకాశం ఇచ్చింది ఒలింపిక్స్ కమిటీ. అదే సింగిల్స్ వ్యక్తిగత షూటింగ్ ఈవెంట్స్‌లో పాల్గొనే వ్యక్తికి పాజిటివ్‌గా తేలితే, ఆ షూటర్‌ పోటీ నుంచి తప్పుకోవాల్సిందే.

పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి ‘డీఎన్‌ఎస్’ (డు నాట్ స్టార్ట్)గా మార్క్ చేసి, కాంపిటీషన్ నుంచి తప్పిస్తారు. మెన్స్, వుమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్, 10 మీ ఎయిర్ పిస్టోల్ కాంపీటీషన్లలో 100 దేశాల నుంచి 356 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు.

భారత్ నుంచి మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో దివ్యాంశ్ సింగ్ పన్వార్-ఎలవెనిల్ వలరివన్, దీపక్ కుమార్-అంజుమ్ మౌంగిల్, సౌరబ్ చౌదరీ - మను బకర్, యశస్వినీ సింగ్ - అభిషేక్ వర్మ పోటీపడబోతున్నారు.

జూలై 23న మొదలయ్యే ఒలింపిక్స్, ఆగస్టు 8న ముగుస్తాయి. ఒలింపిక్ క్రీడలు ముగిసేవరకూ టోక్యో నగరంలో ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని ప్రకటించింది జపాన్ ప్రభుత్వం.

click me!