భారత రెజ్లర్ సుమిత్ మాలిక్‌పై నిషేధం... టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు...

By Chinthakindhi RamuFirst Published Jul 3, 2021, 11:47 AM IST
Highlights

2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సుమిత్ మాలిక్... భారత ప్రభుత్వం నుంచి ‘అర్జున’ అవార్డు...

ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌ పోటీల్లో గెలిచి, 20 రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత...

డోప్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో రెండేళ్ల పాటు బ్యాన్ విధించిన వరల్డ్ రెజ్లింగ్ యూనియన్...

భారత రెజ్లర్, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ సుమిత్ మాలిక్‌పై నిషేధం పడింది. డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో అతనిపై రెండేళ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది వరల్డ్ రెజ్లింగ్ యూనియన్.

సుమిత్ మాలిక్‌కి ఈ బ్యాన్‌పై అప్పీలు చేసుకునేందుకు వారం రోజుల గడువు ఇచ్చింది. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌తో పాటు కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో కూడా రన్నరప్‌గా నిలిచిన సుమిత్, ఒలింపిక్‌లో పతకం గెలవాలని కలలు కన్నాడు.

2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సుమిత్ మాలిక్, భారత ప్రభుత్వం నుంచి ‘అర్జున’ అవార్డు కూడా అందుకున్నాడు. మరో  ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌ పోటీల్లో గెలిచి, 20 రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించాడు.

అయితే ఒలింపిక్స్ ముందు జరిపిన డోపింగ్ పరీక్షల్లో సుమిత్ మాలిక్, నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. ఆ ఉత్ప్రేరకం ఎందుకు వాడింది? ఎలా వాడింది? తెలుపుతూ సుమిత్ ఇచ్చే వివరణను బట్టి అతనిపై నిషేధం తగ్గే అవకాశం ఉంటుంది...

click me!