గంజాయి తాగి దొరికిన అథ్లెట్... ఒలింపిక్ కల చిన్నాభిన్నం

By team teluguFirst Published Jul 3, 2021, 10:02 AM IST
Highlights

టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ రేసులో ఉన్న స్టార్‌ స్ప్రింటర్‌ గంజాయి తాగి.. డోపింగ్‌ పరీక్షలో దొరికిపోయింది.దీంతో ఒలింపిక్‌ ట్రయల్స్‌లో ఆమె సాధించిన రికార్డు 10.86 సెకండ్ల రేసు తుడిచిపెట్టుకుపోవటమే కాదు, టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం సైతం దూరమైంది

ఒక వ్యసనం ఆమె ఒలింపిక్ కలను ఛిద్రం చేసింది. జీవితాశయంగా భావించిన లక్ష్యం ఇక ఆమెదే అని ప్రపంచమంతా అనుకుంటున్నా వేళ డోప్ టెస్టులో పట్టుబడి ఏకంగా టోక్యో ఒలింపిక్స్ దే దూరమవ్వాల్సి వచ్చింది. ఆమే   షకేరి రిచర్డ్‌సన్‌. 

ఒక రేసులో 10.86 సెకండ్లలో వంద మీటర్ల పరుగు పూర్తి చేసింది. టోక్యో ఒలింపిక్స్‌ మహిళల 100 మీటర్ల రేసు ఆమేదేనని క్రీడలోకపు అంచనాలు. అమెరికా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఒలింపిక్‌ ట్రయల్స్‌ అనంతరం స్టార్‌ స్ప్రింటర్‌ షకేరి రిచర్డ్‌సన్‌ గురించే అంతటా చర్చ. మహిళల వంద మీటర్ల పరుగు రాణిగా అప్పుడే అభిమానులు పిలుచుకోవటం మొదలుపెట్టేశారు. 

ఇంతలోనే పిడుగుపాటులా డోపింగ్‌ పరీక్ష ఫలితం వెలువడింది. టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ రేసులో ఉన్న స్టార్‌ స్ప్రింటర్‌ గంజాయి తాగి.. డోపింగ్‌ పరీక్షలో దొరికిపోయింది. దీంతో ఒలింపిక్‌ ట్రయల్స్‌లో ఆమె సాధించిన రికార్డు 10.86 సెకండ్ల రేసు తుడిచిపెట్టుకుపోవటమే కాదు, టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం సైతం దూరమైంది. 

ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జెన్నా ప్రందిని టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించనుంది. ' నేను మనిషినే అని షకేరి రిచర్డ్‌సన్‌ డోపీగా తేలిన అనంతరం ట్వీట్‌ చేసింది. 

I am human

— Sha’Carri Richardson (@itskerrii)

షకేరి రిచర్డ్‌సన్‌పై నెల రోజుల నిషేధం విధించింది. దీనితో ఆమె 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయినట్టయింది. జూన్ 28 నుండి ఆమెపై 30 రోజుల సస్పెన్షన్ కొనసాగుతుంది. అంటే ఆమె 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ... ఒకవేళ గనుక ఆమె పేరును అమెరికా ఎంపిక చేస్తే రిలేలో పాలుపంచుకునే అవకాశం ఉంది. తన ఫాన్స్ కి స్పాన్సర్స్ కి దేశ ప్రజలకు రీచర్డ్సన్ సారీ చెప్పింది. 

click me!