ఏషియన్ గేమ్స్ 2023: పోరాడి ఓడిన నిఖత్ జరీన్.. కాంస్యంతో వెనుదిరిగిన భారత బాక్సర్...

By Chinthakindhi RamuFirst Published Oct 1, 2023, 5:03 PM IST
Highlights

Asian Games 20223: సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడిన నిఖత్ జరీన్... పసిడి ఆశలు ఆవిరి, కాంస్య పతకంతో ఇంటికి.. 

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్య పతకం గెలిచింది. థాయిలాండ్‌కి చెందిన చుతమత్ రక్షత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడింది నిఖత్ జరీన్. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్‌పై భారత్ పసిడి ఆశలు పెట్టుకుంది. అయితే నిఖత్ జరీన్, ఫైనల్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది..

స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత స్క్వాష్ ప్లేయర్లు అనహత్ సింగ్- అభయ్ సింగ్, పాకిస్తాన్ జోడి సిదియా గుల్- ఫర్హాన్ జమాన్‌తో మ్యాచ్‌లో 11-3, 11-2 తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్నారు.

Bronze it is for at 🥊

The ace boxer & gave it all against her fight with 🇹🇭's Raksat C but it was a split decision defeat in the semis.

We salute your fighting spirit!

Heartiest congratulations on the🥉! … pic.twitter.com/h15ZUsm4iv

— SAI Media (@Media_SAI)

స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మరో భారత ద్వయం దీపికా పల్లికల్- హరిందర్ సింగ్, పాక్ జోడి మెశ్వీష్ ఆలీ- నూర్ జనామన్‌లపై 11-4, 11-1 తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు.  

 భారత మహిళల హాకీ జట్టు, సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్‌ని 1-1 తేడాతో డ్రా చేసుకుంది.. టీమిండియా నుంచి నవ్‌నీత్ కౌర్ పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచి, ఓటమి నుంచి కాపాడింది. అక్టోబర్ 3న భారత మహిళా హాకీ జట్టు, హంగ్‌కాంగ్‌తో తలబడుతుంది.

పురుషుల స్క్వాష్ సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ మహేష్ మంగోన్కర్, రౌండ్ 16కి అర్హత సాధించాడు. ఫిలిప్పిన్ ప్లేయర్ జొనాథన్ రేస్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో గెలిచిన మహేష్, జపాన్‌కి చెందిన సుకీతో అక్టోబర్ 2న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడు..
 

click me!