Asia Cup Football 2023: ఫిలిప్పిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో విజయం సాధించిన పాలస్తీనా... గ్రూప్ టాప్ 2గా ఆసియా కప్ 2023 టోర్నీకి అర్హత సాధించిన భారత ఫుట్‌బాల్ టీమ్...
భారత్‌లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ మరో ఆటకి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ ఉన్న ఫుట్‌బాల్‌ని కూడా భారతీయులు పెద్దగా పట్టించుకోరు. భారత ఫుట్‌బాల్ జట్టులో ఉన్న చాలామంది ప్లేయర్ల పేర్లు కూడా జనాలకు తెలియవు. ఆదరణ లేకపోయినా అంతర్జాతీయ వేదికలపై అదిరిపోయే పర్పామెన్స్‌తో ఆకట్టుకుంటోంది భారత ఫుట్‌బాల్ టీమ్...
పాలస్తీనా, ఫిలిప్పిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో విజయం సాధించడంతో భారత జట్టుకి మార్గం సుగమమైంది. హంగ్‌కాంగ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కి ముందే భారత ఫుట్‌బాల్ జట్టు, ఆసియా కప్ 2023 టోర్నీకి అర్హత సాధించినట్టైంది. వరుసగా రెండు సీజన్లలో భారత ఫుట్‌బాల్ టీమ్, ఆసియా కప్‌కి అర్హత సాధించడం ఇదే తొలిసారి...
undefined
ఇంతకుముందు ఎప్పుడూ వరుస సీజన్లలో ఆసియా కప్ టోర్నీ ఆడలేకపోయిన భారత ఫుట్‌బాల్ జట్టు, 2019 ఆసియా కప్ ఆడిన తర్వాత 2023 ఆసియా కప్‌లోనూ పాల్గొనబోతోంది. గ్రూప్ డీలో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. టాప్‌లో ఉన్న హంగ్‌కాంగ్‌కి, భారత జట్టుకి ఒకే గోల్ మాత్రమే తేడా...
హంగ్‌కాంగ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడినప్పటికీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా టాప్ 2గా ఆసియా కప్ 2023కి అర్హత సాధిస్తుంది భారత ఫుట్‌బాల్ టీమ్. కోల్‌కత్తాలో జరుగుతున్న ఆసియా కప్ ఫుట్‌బాల్ గ్రూప్ డీ క్వాలిఫైయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు, కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో ఓడించింది. భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు...
ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచింది భారత జట్టు. భారత ఫుట్‌బాల్ ప్లేయర్ సహల్ అబ్దుల్ సమద్, కీలక సమయంలో రెండో గోల్ చేసి భారత జట్టుకి రెండో విజయాన్ని అందించాడు. ప్రస్తుతం 82 అంతర్జాతీయ గోల్స్‌తో ఉన్న భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ, తన రికార్డును మరింత మెరుగుపర్చుకునేందుకు చూస్తున్నారు...
కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఫుట్‌బాల్ మ్యాచులకు వేల సంఖ్యలో భారత సాకర్ ఫ్యాన్స్ హాజరవుతుండడం విశేషం. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కి 50 వేలకు పైగా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ హాజరుకావడంతో భారత్‌లో ఫుట్‌బాల్‌కి క్రేజ్ పెరుగుతుందనే ఆశలను రేపుతున్నాయి.
1956లో ఆసియా కప్ ఆరంభమైంది. అయితే భారత జట్టు ఇప్పటిదాకా ఐదు సార్లు మాత్రమే ఆసియా కప్ టోర్నీలకు అర్హత సాధించగలిగింది. 1964లో మొదటిసారి ఆసియా ఫుట్‌బాల్ కప్ ఆడిన భారత జట్టు, ఆ తర్వాత 20 ఏళ్లకు 1984లో మళ్లీ ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించగలిగింది...
2011లో ఆసియా కప్ ఆడిన భారత జట్టు, 2019, 2023 సీజన్లలో మొదటిసారిగా వరుసగా బరిలో దిగబోతోంది. 1964లో ఆసియా కప్ ఫైనల్ చేరింది భారత ఫుల్‌బాల్ జట్టు. టీమిండియా రన్నరప్‌తో సరిపెట్టుకోగా, ఆతిథ్య ఇజ్రాయిల్ టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది...
1984లో గ్రూప్ స్టేజీకి మాత్రమే పరిమితమైన భారత ఫుట్‌బాల్ జట్టు, 2011, 2019 సీజన్లలో 16, 17వ స్థానాల్లో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది...