హంగ్‌కాంగ్‌కి షాక్ ఇచ్చిన భారత ఫుట్‌బాల్ టీమ్... టేబుల్ టాపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీకి...

By Chinthakindhi Ramu  |  First Published Jun 15, 2022, 12:18 PM IST

హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయం అందుకున్న టీమిండియా... టేబుల్ టాపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీకి...


Indian FootBall: భారత ఫుట్‌బాల్ టీమ్ ఫేట్ మార్చుకునే ఫీట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు విజయాలు వచ్చినా, క్రేజ్ దక్కించుకోలేకపోయిన ఫుట్‌బాల్ టీమ్, టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ఆదరణ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది...

ఆసియా కప్ గ్రూప్ డీ క్వాలిఫైయర్స్‌లో భాగంగా హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. ఈ విజయంతో టేబుల్ టాపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీలోపాల్గొనబోతోంది భారత జట్టు. ఈ మ్యాచ్‌కి ముందు టేబుల్ టాపర్‌గా ఉంది హంగ్‌కాంగ్‌. దీంతో ఆట ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగిన భారత జట్టు, రెండో నిమిషంలోనే గోల్ సాధించి, హంగ్‌ కాంగ్‌ని ఒత్తిడిలోకి నెట్టేసింది...

Latest Videos

undefined

ఆట ప్రారంభమైన రెండో నిమిషంలో అన్వర్ ఆలీ గోల్ సాధించి, భారత జట్టుకి 1-0 ఆధిక్యం అందించాడు. తొలి సగం ముగుస్తుందనగా ఆట 45వ నిమిషంలో రెండో గోల్ చేసింది టీమిండియా. జీక్సన్ గోల్ సాధించి, టీమిండియా 2-0 ఆధిక్యం అందించాడు.. 

Reliving some of the best moments of India's 🇮🇳 historic victory against Hong Kong last night 💙 ⚔️ 🏆 🐯 💙 ⚽ pic.twitter.com/l5TWSzqQ1E

— Indian Football Team (@IndianFootball)

ప్రత్యర్థి గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టిన భారత జట్టు, 85వ నిమిషంలో మూడో గోల్ చేసింది. మన్వీర్ సింగ్ గోల్‌తో టీమిండియా ఆధిక్యం 3-0కి దూసుకెళ్లింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో 90+3వ నిమిషంలో ఇషాన్ పండిట గోల్ సాధించి భారత జట్టుకి 4-0 తేడాతో తిరుగులేని ఆధిక్యం అందించాడు... దీంతో గ్రూప్ డీలో 9 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఆసియా కప్‌ 2023 టోర్నీ ఆడనుంది భారత జట్టు... 

అంతకుముందు పాలస్తీనా, ఫిలిప్పిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో విజయం సాధించడంతో భారత జట్టుకి మార్గం సుగమమైంది. హంగ్‌కాంగ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కి ముందే భారత ఫుట్‌బాల్ జట్టు, ఆసియా కప్ 2023 టోర్నీకి అర్హత సాధించినట్టైంది. వరుసగా రెండు సీజన్లలో భారత ఫుట్‌బాల్ టీమ్, ఆసియా కప్‌కి అర్హత సాధించడం ఇదే తొలిసారి...

ఇంతకుముందు ఎప్పుడూ వరుస సీజన్లలో ఆసియా కప్ టోర్నీ ఆడలేకపోయిన భారత ఫుట్‌బాల్ జట్టు, 2019 ఆసియా కప్‌ ఆడిన తర్వాత 2023 ఆసియా కప్‌లోనూ పాల్గొనబోతోంది. కోల్‌కత్తా‌లో జరుగుతున్న ఆసియా కప్ ఫుట్‌బాల్ గ్రూప్ డీ క్వాలిఫైయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు, కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో ఓడించింది. భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు...

ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచింది భారత జట్టు. భారత ఫుట్‌బాల్ ప్లేయర్ సహల్ అబ్దుల్ సమద్, కీలక సమయంలో రెండో గోల్ చేసి భారత జట్టుకి రెండో విజయాన్ని అందించాడు. 

కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఫుట్‌బాల్ మ్యాచులకు వేల సంఖ్యలో భారత సాకర్ ఫ్యాన్స్ హాజరవుతుండడం విశేషం. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కి 50 వేలకు పైగా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ హాజరుకావడంతో భారత్‌లో ఫుట్‌బాల్‌కి క్రేజ్ పెరుగుతుందనే ఆశలను రేపుతున్నాయి. 

1956లో ఆసియా కప్ ఆరంభమైంది. అయితే భారత జట్టు ఇప్పటిదాకా ఐదు సార్లు మాత్రమే ఆసియా కప్ టోర్నీలకు అర్హత సాధించగలిగింది. 1964లో మొదటిసారి ఆసియా ఫుట్‌బాల్ కప్ ఆడిన భారత జట్టు, ఆ తర్వాత 20 ఏళ్లకు 1984లో మళ్లీ ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధించగలిగింది...

2011లో ఆసియా కప్ ఆడిన భారత జట్టు, 2019, 2023 సీజన్లలో మొదటిసారిగా వరుసగా బరిలో దిగబోతోంది. 1964లో ఆసియా కప్ ఫైనల్ చేరింది భారత ఫుల్‌బాల్ జట్టు. టీమిండియా రన్నరప్‌తో సరిపెట్టుకోగా, ఆతిథ్య ఇజ్రాయిల్‌ టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది...

1984లో గ్రూప్ స్టేజీకి మాత్రమే పరిమితమైన భారత ఫుట్‌బాల్ జట్టు, 2011, 2019 సీజన్లలో 16, 17వ స్థానాల్లో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది...

click me!