యంగ్ 'ఫిడే క్యాండిడేట్‌'గా చరిత్ర సృష్టించిన భార‌త‌ చెస్‌ ప్లేయర్ గుకేష్

Published : Apr 22, 2024, 03:04 PM IST
యంగ్ 'ఫిడే క్యాండిడేట్‌'గా చరిత్ర సృష్టించిన భార‌త‌ చెస్‌ ప్లేయర్ గుకేష్

సారాంశం

Candidates Chess tournament : కెనడాలో జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ చాంపియన్ షిప్ లో భార‌త చెస్ ప్లేయ‌ర్ డి.గుకేష్ విజేతగా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత టైటిల్ నెగ్గిన రెండో భార‌తీయుడిగా చ‌రిత్ర సృష్టించాడు.   

Indian chess player Gukesh Dommaraju : భార‌త‌ చెస్‌ ప్లేయర్ డి గుకేష్ చ‌రిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల వయసులో యంగ్ 'ఫిడే క్యాండిడేట్‌'గా నిలిచాడు. కెనడాలోని టొరంటోలో క్యాండిడేట్స్ చెస్ చాంపియన్ షిప్ జరిగింది. యువ గ్రాండ్ మాస్టర్లు గుకేష్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ భారత్ కు ప్రాతినిధ్యం వహించగా, మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి, కోనేరు  హంపి భారత్ కు ప్రాతినిధ్యం వహించారు.

14 రౌండ్ల సిరీస్ ఫైనల్లో 17 ఏళ్ల డి గుకేష్ అమెరికాకు చెందిన కిహారు నకమురాతో తలపడ్డాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇద్దరూ 1/2 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్ లో అమెరికాకు చెందిన ఫాబియానో కరుణ, రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచి తలపడ్డారు. ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. 2024 ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా చరిత్ర సృష్టించిన గుకేష్ 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్ నెగ్గిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

 

 

నకమురా 8.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఏడు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. గుకేష్ తొలిసారి క్యాండిడేట్స్ ఛాంపియన్ షిప్ గెలిచాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ తో తలపడేందుకు అర్హత సాధించారు. అతి పిన్న వయస్కుడైన గుకేశ్ ను విశ్వనాథన్ ఆనంద్ అభినందించారు. చిన్న వయసులోనే ఛాంపియన్ గా నిలిచినందుకు అభినందనలు తెలిపారు. గుకేష్ 12 సంవత్సరాల వయస్సులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్నాడు. చెస్ చరిత్రలో మూడవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని కూడా సాధించాడు.

 


ప్రధాని మోడీ, విశ్వనాథన్ ఆనంద్, ఎంకే స్టాలిన్ సహా చాలా మంది ప్రముఖులు గుకేష్ కు అభినందనలు తెలిపారు. 

 

 

ఐపీఎల్ లో మ‌రో ర‌చ్చ‌.. విరాట్ కోహ్లీ ఔట్ పై ఎంపైర్ నిర్ణయం సరైందేనా...? అస‌లేం జ‌రిగింది? 

PREV
click me!

Recommended Stories

100 సిక్సర్లతో దుమ్మురేపిన అభిషేక్ శర్మ !
భారత్ వద్దు.. పాక్ ముద్దు.. కేకేఆర్ ఆటగాడి సంచలన నిర్ణయం