Virat Kohli : కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కపరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ నిర్ణయం మరో చర్చకు దారితీసింది.
Virat Kohli : ఐపీఎల్ 2024 17వ సీజన్ 36వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ పై విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో నరాలు తెగే ఉత్కంఠను రేపింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి వికెట్‌పై రచ్చ, ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన బౌలింగ్, ఆఖరి ఓవర్‌లో కరణ్ శర్మ మూడు సిక్సర్లు, కేకేఆర్ విజయం.. ఇలా ఎన్నో ఎన్నో అంశాలు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య చేధనలో బెంగళూరు జట్టు కేవలం ఒక్కపరుగు దూరంలో ఆగిపోయింది. 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.
అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. కేకేఆర్ ఉంచి భారీ టార్గెట్ తో దూకుడుగా ఆడాడు కోహ్లీ. 7 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ 18 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. హర్షిత్ రాణా వేసిన మూడో ఒవర్ తొలి బంతిని ఆడిన కింగ్ కోహ్లీ బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీని ఔట్ గా ప్రకటించాడు ఎంపైర్. కానీ, ఆ బాల్ నడుము కంటే పైకి వచ్చిందంటూ థర్డ్ అంపైర్, ఫీల్డ్ అంపైర్ రిఫర్ చేశాడు. అయితే, రివ్య్యూలో ఆ బాల్ సరైందేనని ఎంఫైర్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ, ఎంపైర్ పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
undefined
విరాట్ కోహ్లీ ఔట్ గా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఎంపైరింగ్ రచ్చ మొదలైంది. నెట్టింట కూడా హాట్ టాపిక్ గా మారింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ దీనిపై స్పందిస్తూ.. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్ని ఆనందంగా చూడలేమనీ, కోహ్లి నాటౌట్ అని బల్ల గుద్ది చెబుతున్నానని పేర్కొన్నాడు. కోహ్లీ ఔట్ పై అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్, సాంకేతికతపై వినియోగదారులు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఏబీ డివిలియర్స్ మరింత స్పష్టత ఇవ్వాల్సిందని పేర్కన్నాడు. కోహ్లీ ఔట్ ను అంబటి రాయుడు ఎత్తిచూపాడు.
IPL 2024 : అయ్యో విరాట్ కోహ్లీ.. కేకేఆర్ దెబ్బకు ప్లేఆఫ్ రేసు నుంచి ఆర్సీబీ ఔట్..