
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఒకసారి శ్రీలంకతోసం యుక్త విజేత అయ్యింది. ఈ విజయంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా వైట్ కోట్‌ను కూడా సొంతం చేసుకుంది. చారిత్రక ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ గెలవడంతోపాటు జట్టుకు గౌరవంగా వైట్ కోట్ లభిస్తుంది. దానికో చరిత్ర ఉంటుంది.
టీమిండియాకు వైట్ జాకెట్ ఎందుకు లభించింది? వైట్ కోట్ సంప్రదాయం ఎప్పటి నుండి ఉంది?
ఫైనల్‌లో గెలిచిన తర్వాత భారత జట్టు ట్రోఫీని అందుకోవడానికి మైదానంలోకి దిగినప్పుడు, వారికి ప్రత్యేక వైట్ జాకెట్ (White Jacket) అందజేస్తారు. వాటిని ధరించిన తర్వాతే విజేతలు మైదానంలోకి అడుగు పెడతారు. ఈ సంప్రదాయం 2009 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2009) నుండి కొనసాగుతోంది. ICC విజేతలకు ఈ ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడం అప్పటినుంచే మొదలైంది.
వైట్ జాకెట్ చరిత్ర మరియు దాని ప్రాముఖ్యత
ICC (International Cricket Council) ప్రకారం, ఈ జాకెట్ విజేత జట్టుకు మాత్రమే ఇస్తారు. ఇది ఛాంపియన్‌గా నిలిచారు అనేదానికి గుర్తు. ‘వైట్ జాకెట్ అనేది గౌరవానికి చిహ్నం, దీనిని ఛాంపియన్లు మాత్రమే ధరిస్తారు. ఇది వ్యూహాత్మక నైపుణ్యం , విజయం కోసం సాగించిన పోరాటాన్ని సూచిస్తుంది’ అని ఐసీసీ పేర్కొంది. పాకిస్తాన్, UAEలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో వైట్ జాకెట్‌ను ఈసారి దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ (Wasim Akram) ప్రారంభించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రపంచంలోని అత్యుత్తమ జట్ల మధ్య జరిగిన తీవ్ర పోటీకి సాక్షిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ ట్రోఫీని, వైట్ కోట్ ను గెలుచుకున్న జట్టును బలమైన జట్టుగా పరిగణిస్తారు.
ఇటాలియన్ ఉన్ని, బంగారు అంచుతో..
ఈ జాకెట్‌ను ముంబైకి చెందిన బబితా ఎమ్ (Babita M) డిజైన్ చేశారు. దీన్ని ఇటాలియన్ ఉన్ని (Italian Wool) తో ప్రత్యేకంగా మలుస్తారు. బంగారు అంచు, జాకెట్‌పై ప్రత్యేక ఎంబ్రాయిడరీ చేసిన బంగారు లోగో కూడా ఉంటుంది.