గురువారం భారత స్పిన్ సత్తా చాటింది. వెస్టిండీస్ 114 పరుగులకే ఆలౌట్ కావడంతో రవీంద్ర జడేజా ఉచ్చు బిగించాడు. మూడు వికెట్లు తీసి కొత్త ప్రపంచరికార్డ్ సాధించాడు.
విండీస్ వర్సెస్ భారత్ వన్డే సిరీస్ లో వెస్టిండీస్ పేలవ ప్రదర్శన కనపరుస్తోంది. టెస్ట్ సిరీస్ లో ఫెయిల్యూర్ ప్రదర్శనతో దెబ్బతిన్నప్పటికీ వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆట తీరు మారలేదు. వన్డే సిరీస్ లోనూ అదే ఆటతీరు ప్రదర్శిస్తుంది. భారత్తో బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 114 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి కుప్పకూలింది.
విండీస్ జట్టులోని బ్యాటర్లంతా దారుణంగా ఆట తీరు ప్రదర్శించారు. కెప్టెన్ షాయ్ హోప్ (43) తప్ప మిగతా వారంతా ఎక్కువ రన్స్ చేయలేకపోయారు. దీంతో భారత బౌలర్లైన కుల్దీప్ యాదవ్ కు నాలుగు వికెట్లు.. జడేజాకు మూడు వికెట్లు ఇచ్చేశారు. యాదవ్, జడేజా.. విండీస్ వికెట్లతో వారి పతనాన్ని శాసించారు.
వెస్టీండీస్ VS భారత్ : క్యాచ్ పట్టడం ఇంత ఈజీనా.. విరాట్ కోహ్లీ అదరగొట్టాడుగా...(వీడియో)
దీంతో భారత్ ముందు అత్యంత స్వల్ప లక్ష్యం 115 ను రన్స్ నిలిచింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన కిషన్ 52 పరుగులతో భారత ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు ఈ మ్యాచ్లో. అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్ పై వన్డే ఫార్మాట్లో అత్యధిక వికెట్స్ తీసిన భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. తొలి వన్డే లోనే మూడు వికెట్లు తీసి ఈ అరుదైన ఘనతను తన పేరిట రాసుకున్నాడు రవీంద్ర జడేజా.
రవీంద్ర జడేజా విండీస్పై వన్డేల్లో ఇప్పటివరకు 44 వికెట్లు తీశాడు. అంతకుముందు ఈ రికార్డ్ కపిల్ దేవ్ 43 వికెట్లతో రికార్డు అయి ఉంది. దీనికి జడేజా బ్రేక్ చేశాడు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డేల్లో.. ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా ఇప్పటివరకు రికార్డ్ ఉన్న దిగ్గజ విండీస్ పేస్ బౌలర్ కోర్ట్నీ వాల్స్ రికార్డును రవీంద్ర జడేజా సమం చేశాడు.