IND vs IRE: ఉత్కంఠ భ‌రిత‌ పోరులో టీమిండియా విజయం.. సిరీస్ భార‌త్ వ‌శం

By Rajesh KFirst Published Jun 29, 2022, 1:55 AM IST
Highlights

India vs Ireland 2nd T20: భార‌త్, ఐర్లాండ్ ల‌ మ‌ధ్య మంగ‌వారం జ‌రిగిన ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన‌ రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా  విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో దుమ్మురేపిన హార్ధిక్ సేన తర్వాత బౌలింగ్ లో కూడా రాణించి సిరీస్‌ను 2-0తో కైవ‌సం చేసుకుంది. 

India vs Ireland 2nd T20: పసికూన ఐర్లాండ్‌, యంగ్ టీమిండియాల మ‌ధ్య జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ఈ పోరులో యువ భార‌త సేన 4 పరుగుల తేడాతో ఐర్లాండ్ పై విజయం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ ముందు పెట్టింది. కానీ, ఐర్లాండ్  ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా.. ల‌క్ష్యం వైపుగా సాగింది. ఒక‌నొక ద‌శ‌లో ఐర్లాండే విజ‌యం సాధింస్తుందా..!? అనేలా.. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఉత్కంఠ పోరు జ‌రిగింది.  అయితే ఆఖర్లో.. భార‌త బౌల‌ర్లు  ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్  అద్బుతంగా బౌలింగ్‌తో ఐర్లాండ్ పై విరుచుక‌ప‌డ్దారు. దీంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయింది. దీంతో టీమిండియా ఓట‌మి నుంచి త‌ప్పించుకుని విజ‌యం సాధించింది. సిరీస్ కైవ‌సం చేసుకుంది.  

228 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌డానికి ఐర్లాండ్‌ బ్యాట్స్ మెన్స్ తీవ్రంగా శ్ర‌మించారనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ వ‌చ్చిన ఆండ్రూ బాల్బర్నీ భార‌త బౌల‌ర్లను ఓ రేంజ్లో ఆడుకున్నాడు. 37 బాల్స్ లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టి.. 60 ప‌రుగులు సాధించారు. ఆ త‌రువాత వ‌చ్చిన పాల్‌ స్టిర్లింగ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆయ‌న  8 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి.. 40 ప‌రుగులు చేశారు. అనంత‌రం బ్యాటింగ్ కు వ‌చ్చిన‌.. హ్యారీ టెక్టర్ కూడా దుమ్ము రేపాడు. 39 పరుగులు చేశాడు. చివర్లో వ‌చ్చిన‌ జార్జ్‌ డాక్‌రెల్ 34 ప‌రుగులు చేసి.. నాటౌట్ గా నిలిచారు.  మార్క్‌ ఎడైర్ కూడా 23 చేసి నాటౌట్ గా నిలిచారు. 

ఇక.. టీమిండియా బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, రవి బిష్ణోయి చేరో ఒక వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్ లో టిమిండ‌యా విజ‌యం సాధించి..  టి20 సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

అంతకుముందు టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (104) శతకం బాదగా ఓపెనర్ గా వచ్చిన సంజూ శాంసన్ (77) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

భారత జట్టు: సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), దినేశ్‌ కార్తిక్‌ (వికెట్‌కీపర్‌), అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షల్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌

ఐర్లాండ్‌: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్‌), హ్యారీ టెక్టార్‌, గరేత్‌ డిలనీ, పాల్‌ స్టిర్లింగ్‌, లోర్కాన్‌ టకర్‌, జార్జ్‌ డాక్రెల్‌, మార్క్‌ అడేర్‌, జాషువా లిటిల్‌, ఆండీ మెక్‌బ్రిన్‌,  కానర్‌ ఆల్ఫర్ట్‌, క్రెయిగ్‌ యంగ్‌.

click me!