వరల్డ్ కప్ గెలిచే సత్తా టీఇండియాకే వుంది: ఐసిసి చీఫ్

By Arun Kumar PFirst Published Feb 2, 2019, 10:41 AM IST
Highlights

ఇంగ్లాండ్‌లో ఈ ఏడాది ప్రపంచ దేశాల మధ్య జరిగే వరల్డ్ కప్ సమరంలో గెలిచే సత్తా టీంఇండియాకే వుందని ఐసిసి సీఈవో డేవ్ రిచర్డ్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న భారత జట్టును, దాని ఆటతీరును చూసే ఇలా మాట్లాడుతున్నానని...ఇందులో అతిశయోక్తేమీ లేదని అన్నారు. మంచి ఫామ్ లో వున్న భారత జట్టు ఇదే ఊపు కొనసాగిస్తే వరల్డ్ కప్ ట్రోపిని సొంతం చేసుకోవడం అంత కష్టమైన పనేమీ కాదని రిచర్డ్సన్ అన్నారు. 
 
ముంబైలో జరిగిన ఐసిసి వరల్డ్ కప్ ట్రోపి ఆవిష్కరణ కార్యక్రమంలో రిచర్డ్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే జట్లు బలాబలాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆటతీరును చూస్తే మూడు జట్ల మధ్య ప్రధానంగా పోటీ వుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పటిష్టంగా కనిపిస్తున్న భారత్, దక్షిణాఫ్రికాలతో పాటు స్వదేశంలో జరిగే టోర్నీలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు విజృంభించే అవకాశం వుందన్నారు. 

అయితే ప్రస్తుతం టీంఇండియా ఫామ్ చూస్తుంటే దాన్ని ఓడించడం ఏ జట్టుకైనా కష్టమేనని అన్నారు. అయితే ఈప్న మెగా టోర్నీలో ఏ జట్టును కూడా అంత తక్కవగా అంచనా వేయలేమని అన్నారు. ప్రతి టీం ప్రపంచ కప్ ట్రోపిని అందుకోవాలనే బరిలోకి దిగుతాయి. కాబట్టి తమ అత్యుత్తమ ఆటతీరునే కనబరుస్తాయని రిచర్డ్సన్ తెలిపారు. కాబట్టి ప్రపంచ కప్ ట్రోపి విజేతలను ఊహించడం కష్టమన్నారు. 

click me!