వన్డే ప్రపంచకప్ భారత్ లోనే...: ఐసిసి

By Arun Kumar PFirst Published Feb 1, 2019, 4:47 PM IST
Highlights

భారత దేశంలో క్రీడలపై విధిస్తున్న అధిక పన్నుల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తోందిన గతకొంత కాలంగా ఐసిసి ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్ లో భారత్ లో జరగనున్న చాంఫియన్ ట్రోపి(2021), వన్డే వరల్డ్ కప్(2023) లకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని ఐసిసి కోరింది. లేదంటే ఈ మెగా టోర్నీలను ఇతర దేశాలకు తరలిస్తామని కూడా హెచ్చరించిన  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఐసిసి చీఫ్ డేవ్ రిచర్డ్సన్ ఈ విషయంపై సంచలన ప్రకటన చేశారు. 

భారత్ లో నిర్వహించే ఛాంపియన్ ట్రోపి, ప్రపంచ కప్ టోర్నీలను ఇతర దేశాలకు తరలించే ఆలోచన ఐసిసికి లేదని రిచర్డ్సన్ అన్నారు. కానీ భారత్ లో విధిస్తున్న అధిక పన్నుల మూలంగా ఐసిసి చాలా నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. ప్రపంచ క్రికెట్ కు పన్ను మినహాయింపులు చాలా ముఖ్యమని...ఆ దిశగా వివిధ దేశాల బోర్డులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఐసిసి కి వచ్చే ప్రతి పైసాను క్రికెట్ కోసమే ఖర్చు పెడతామని రిచర్డ్సన్ తెలిపారు. కాబట్టి క్రికెట్ అభివృద్ది కోసం తమ వంతు సాయంగా ప్రభుత్వాలు క్రికెట్ టోర్నీలపై విధించే పన్నులను తగ్గించుకోవాలని కోరారు.  

భారత్ లో నిర్వహించే చాంఫియన్ ట్రోపి, వన్డే వరల్డ్ కప్ లకు ఇంకా చాలా సమయం వుందని...ఆలోపు ప్రభుత్వంతో పన్ను మినహాయింపుపై చర్చలు జరుపుతామన్నారు.  ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ  మెగా టోర్నీలపై విధించే పన్నుల నుండి మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు రిచర్డ్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

2016లో భారత్ లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ప్రసారాలు, ఇతరత్రా  మార్గాల్లో వచ్చిన ఆదాయంపై ప్రభుత్వం రూ.161.32 కోట్ల పన్నులు విధించింది. ఈ టోర్నీకి ప్రసారకర్తగా వున్న సోనీ స్పోర్ట్స్ మొదట ఈ పన్నులను చెల్లించి మిగతా మొత్తాన్ని ఐసీసీకి అందించింది. ఇలా అధిక పన్నుల మూలంగా చాలా నష్టపోవాల్సి వచ్చిందని...తమకు జరిగిన నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేయాలని ఐసీసీ డిమాండ్‌ చేసింది. తమ నష్టాన్ని చెల్లించకపోతే భారత్‌లో భవిష్యత్ లో జరిగే మెగా టోర్నీలను ఇతర దేశాలకు తరలిస్తామని కూడా హెచ్చరించింది.    

click me!