Hyderabad Formula E Race: హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ట్యాంక్ బండ్ చుట్టూ నేడు ఎలక్ట్రిక్ కార్లు రయ్ రయ్ మని దూసుకెళ్లనున్నాయి.
భాగ్యనగర వాసులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. నెల రోజులుగా ఫార్ములా ఈ రేస్ కోసం ఆసక్తిగా చూస్తున్న నగరవాసులతో పాటు ఇతర రాష్ట్రాల అభిమానులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ జలాశయం (ట్యాంక్‌బండ్) చుట్టూ ఎలక్ట్రిక్ కార్లు రయ్ రయ్ మని దూసుకుపోనున్నాయి. 2.8 కిలోమీటర్ల పొడవున్న స్ట్రీట్ సర్క్యూట్ లో నేడు ప్రీ ప్రాక్టీస్ రేసు జరుగనుంది. శుక్రవారం సాయంత్రం 4:25 గంటల నుంచి 5:15 గంటల వరకూ ఈ రేసు కొనసాగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఫార్ములా ఈ రేస్ 9వ సీజన్ సందర్భంగా హైదరాబాద్ వేదికగా నాలుగో రేస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు జరిగే ప్రాక్టీస్ రేస్ తో రేసర్లకు ఈ ట్రాక్ మీద ఒక అవగాహన రానున్నది. 18 మలుపులతో కూడిన ఈ ట్రాక్ పై ఎలా స్పందిస్తుంది..? కార్లను ఎలా అదుపు చేసుకోవాలి..? ఎక్కడ వేగం పెంచాలి..? వంటి విషయాలపై వారికి స్పష్టమైన అవగాహన కలిగేందుకు ఈ ప్రీ రేసును నిర్వహించనున్నారు.
undefined
ఇదివరకే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. మొత్తం 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు ఈ ప్రీ రేస్ లో పాల్గొననున్నారు. నేటి ప్రీ రేస్ తర్వాత రేపు (శనివారం) క్వాలిఫయింగ్, మెయిన్ రేస్ ఉండనుంది. ఐమ్యాక్స్ పక్కన ఉన్న ఇందిరాగాంధీ చౌక్ నుంచి ఈ రేసు మొదలుకానుంది. ట్రాక్ తో పాటు అభిమానుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలు, వీవీఐపీ గ్యాలరీలు పూర్తిగా సిద్ధమయ్యాయని, మిగిలిన పెండింగ్ పనులను రేపటికల్లా పూర్తి చేస్తామని ఓ అధికారి తెలిపారు.
It was wonderful meeting Ji & Ji at
Wishing them great success at the Formula E racing!
Thank you Garu for bringing such amazing initiatives to our city. pic.twitter.com/yKOqpuJ6z5
రేసు కోసం ప్రత్యేక గీతం..
ఫార్ములా ఈ రేసుకు ప్రాచుర్యం కల్పించేందుకు గాను ఓ ప్రత్యేక గీతాన్ని (ఆంథమ్) కూడా రూపొందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్.. దీనిని స్వరాలు అందించారు. ‘హైదరాబాద్ ఆంథమ్’ పేరిట రూపొందించిన ఈ వీడియోలో ప్రముఖ సినీనటుడు సాయిధరమ్ తేజ్ కూడా కనిపించాడు.
After 8 years of racing around the world, we finally get our home race! is coming to India for the first time. Thanks & for this. Come, at the . pic.twitter.com/aXTAqWtiaH
— anand mahindra (@anandmahindra)రేసును చూడటానికి తారలు, క్రికెటర్లు..
భారత్ లో తొలిసారి జరుగనున్న ఫార్ములా ఈ రేసును ప్రత్యక్షంగా వీక్షించడానికి సెలబ్రిటీలు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటులు ఈ రేసుపై విస్తృత ప్రచారం కల్పించారు. మహేశ్ బాబు, ప్రభాస్, వెంకటేశ్, శర్వానంద్, నవీన్ పొలిశెట్టిలు ఇందుకు సంబంధించి వీడియోలు కూడా చేశారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటీనటులు కూడా రేసును వీక్షించేందుకు రానున్నారు. వీరితో పాటు టీమిండియా క్రికెటర్లు శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహళ్, దీపక్ చాహర్ లు కూడా ఈ రేసును ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. భార్య ధనశ్రీతో కలిసి ఈ రేసును చూసేందుకు హైదరాబాద్ రానున్నానని చాహల్ తెలిపాడు. దీపక్ చాహర్ కూడా తన భార్యతో భాగ్యనగారానికి వచ్చే అవకాశాలున్నాయి.
Happy to be Part Of this Great Initiative by Our Gaaru thanks for the Wonderful Opportunity dear sir ✊❤️
TEAM AT
Here it is 🏎️🧿🥁 🧨https://t.co/3B3qE0hddr