ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరిన హైదరాబాద్ ఎఫ్‌సీ... మార్చి 20న కేరళ బ్లాస్టర్స్‌తో ఫైనల్ ఆడేందుకు సిద్ధం...
ఇండియన్ సూపర్ లీగ్‌లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్‌కి ఫైనల్‌లోకి దూసుకొచ్చింది. మార్చి 20న కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తలబడనుంది హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్. 2014 ఆరంభ సీజన్‌లో ఫైనల్ చేరిన కేరళ బ్లాస్టర్స్... కోల్‌కత్తా చేతుల్లో ఓడి టైటిల్ సాధించలేకపోయింది...
అయితే ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలో దిగిన హైదరాబాద్ ఎఫ్‌సీ, అన్యూహ్య విజయాలతో ఫైనల్‌కి అర్హత సాధించి అదరగొట్టింది. బుధవారం సెమీ ఫైనల్ 2 మ్యాచ్‌లో డిఫెండింగ్ రన్నరప్ ఏటీకే మోహన్ బగాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఓడింది హైదరాబాద్ ఎఫ్‌సీ...
The stage is set for a new Champion 🏟🏆
How excited are you for the Final Battle between and ? ⚔️🤩 pic.twitter.com/MPubPYtr80
undefined
అయితే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్‌పై 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఓవరాల్‌గా హైదరాబాద్ ఎఫ్‌సీ ఖాతాలో మూడు గోల్స్ ఉండగా, 2 గోల్స్ మాత్రమే సాధించిన ఏటీకే మోహన్ బగాన్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది... మరో సెమీ ఫైనల్‌లో జంషెడ్ పూర్ ఎఫ్‌సీతో తలబడిన కేరళ బ్లాస్టర్స్... ఓ గోల్ తేడాతో ఫైనల్‌కి అర్హత సాధించింది. మొదటి సెమీస్‌లో జంషెడ్ పూర్‌ని 0-1 తేడాతో ఓడించిన కేరళ బ్లాస్టర్స్, రెండో సెమీస్‌లో 1-1 తేడాతో డ్రా చేసుకోగలిగింది.
ఇప్పటిదాకా ఏటీకే మోహన్ బగాన్, మూడు సార్లు (2014, 2016, 2020) సీజన్లలో టైటిల్స్ గెలిచి... మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్లబ్‌గా ఉండగా చెన్నియన్ ఎఫ్‌సీ రెండు సార్లు (2015, 2018) టైటిల్స్ సాధించింది. ముంబై సీటీ గత సీజన్‌లో తొలిసారి ఛాంపియన్‌గా నిలవగా బెంగళూరు ఎఫ్‌సీ 2019లో ఛాంపియన్‌గా నిలిచింది...
బ్రెజిల్ ప్లేయర్ జోవో విక్టర్, హైదరాబాద్ ఎఫ్‌సీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమని వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు... గోవాలోని ఫటోర్డా స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కి నూరు శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది ఎక్స్‌పర్ట్స్ ప్యానెల్.
ఫటోర్డా జవహార్ లాల్ నెహ్రా స్టేడియం కెపాసిటీ ప్రస్తుతం 19 వేలు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి సామర్థ్యం మేరకు టికెట్లను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది ఇండియన్ సూపర్ లీగ్. అయితే కరోనా వ్యాక్సిన్ రెండో డోసుల కోర్సు పూర్తి చేసుకుని, సర్టిఫికెట్ చూపించినవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు.
2019లో పూణే సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ని కొనుగోలు చేసిన తెలంగాణ వ్యాపారవేత్త విజయ మద్దూరి, కేరళ బ్లాస్టర్స్ మాజీ సీఈవో వరుణ త్రిపురనేనితో పాటు హీరో రానా దగ్గుపాటి కలిసి హైదరాబాద్ ఎఫ్‌సీని స్థాపించారు. 2019 అక్టోబర్‌లో అధికారికంగా ఐఎస్‌ఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ ఎఫ్‌సీ... అతి తక్కువ సమయంలో అదిరిపోయే ఆటతీరుతో ఫైనల్‌లో ప్రవేశించడం విశేషం...