క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్

First Published Jun 8, 2018, 2:55 PM IST
Highlights

హర్యానా ప్రభుత్వం రాష్ట్ర క్రీడాకారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

గురుగ్రామ్: హర్యానా ప్రభుత్వం రాష్ట్ర క్రీడాకారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి లేదా కమర్షియల్ ఎండార్స్ మెంట్స్ నుంచి ఆదాయంలో క్రీడాకారులు మూడో వంతు రాష్ట్ర క్రీడా మండలికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఈ మేరకు ఏప్రిల్ 30వ తేదీన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్రీడాకారులు ఇచ్చే డబ్బును రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి హర్యానా క్రీడా మండలి ఖర్చు చేస్తుందని తెలిపింది.

ప్రభుత్వంలోనూ, ప్రబుత్వానికి సంబంధించిన ఇతర సంస్థల్లోనూ పనిచేస్తున్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడానికి అసాధారమైన సెలవులు ఇస్తున్నారని, ఈ పోటీల ద్వారా వచ్చే ఆదాయంలో మూడో వంతు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేదా సమీక్షించాలని వారు కోరుతున్నారు. 

హర్యానాలో రెజ్లింగ్, బాక్సింగ్, కబడ్డి, తదితర క్రీడల్లో పాల్గొనేవారు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల పట్ల భారత అథ్లెట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

click me!