టెస్ట్ జట్టులోకి తెలుగు కుర్రాడు...టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

By Arun Kumar PFirst Published Sep 7, 2018, 6:20 PM IST
Highlights

ఇప్పటికే ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సీరీస్ ను టీంఇండియా కోల్పోయింది. దీంతో ఇవాళ నామమాత్రంగా జరుగుతున్న మ్యాచ్ గెలిచైనా పరువు నిలబెట్టుకోవాలని భారత జట్టు భావిస్తోంది. దీంతో ఎలాంటి మార్పులు లేకుండానే మూడు, నాలుగు టెస్ట్ లను ఆడిన జట్టు ఐదో మ్యాచ్ కోసం చాలా మార్పులు చేసింది.  ఈ మార్పుల కారణంగా ఓ తెలుగు క్రికెటర్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఆరంగేట్ర మ్యాచ్ ఆడే అవకాశం అతడిని వరించింది. సీరీస్ కోల్పోయిన ఓ తెలుగోడు మ్యాచ్ ఆడుతుండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. 
 
ఆతిథ్య ఇంగ్లాండ్ తో ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్ట్ లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఆడనున్నాడు. భారత జట్టుతో పాటు ఇంగ్లాండ్ కు వెళ్లిన ఇతడు ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లోనూ తుది జట్టులోకి ఎంపిక కాలేదు. అయితే ఇవాళ్టి మ్యాచ్ చాలా మార్పులు జరగడంతో హార్దిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారికకి అవకాశం లభించింది. మ్యాచ్ కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ విహారికి క్యాప్ అందజేసి టీంలోకి ఆహ్వానించాడు. దీంతో భారత జట్టులో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న 292వ ఆటగాడిగా విహారి నిలిచాడు.

ఐదో టెస్ట్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత జట్టుతో పాటు విహారి కూడా గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఈ సమయంలోనే కోహ్లీ విహారికి క్యాప్ అందజేసి అభినందించాడు. 

click me!