ప్రాణాలు తీసిన ఆనందం: ఫిఫా సంబరాల్లో విషాదం.. ఇద్దరు అభిమానుల మృతి

 |  First Published Jul 16, 2018, 1:44 PM IST

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో క్రొయేషియాను 4-2 తేడాతో ఓడించి ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత విశ్వవేదికపై ఫ్రాన్స్ పతాకం రెపరెపలాడటంతో ఆ దేశ అభిమానులు లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చారు. అయితే ఈ వేడుకలు విషాదానికి దారి తీసింది


ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో క్రొయేషియాను 4-2 తేడాతో ఓడించి ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత విశ్వవేదికపై ఫ్రాన్స్ పతాకం రెపరెపలాడటంతో ఆ దేశ అభిమానులు లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చారు. అయితే ఈ వేడుకలు విషాదానికి దారి తీసింది.. అభిమాననుల ఆనందం శృతిమించడంతో పలు చోట్లు హింసాత్మక సంఘటనలు జరిగాయి. జాతీయ పతాకాన్ని పట్టుకుని పిరమిడ్ ఆకారంలో నిలుచుని .. రోడ్లపై పాటలు పాడుతూ.. డ్యాన్స్‌లు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు..

ఒళ్లు తెలియని ఆనందంలో ఓ 50 ఏళ్ల వృద్ధుడు ఎత్తయిన ప్రదేశం నుంచి కెనాల్‌పై  నుంచి దూకాడు.. దీంతో మెడలు విరిగి మరణించాడు.. మరో చోట అడ్డదిడ్డంగా కారు నడుపుతూ.. విన్యాసాలు చేసిన ఓ 30 ఏళ్ల యువకుడు చెట్టును ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. అభిమానుల ఉత్సాహం హద్దులు దాటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిపై టియర్ గ్యాస్,, వాటర్ గన్లను ప్రయోగించి చెల్లాచెదురు చేశారు..

Latest Videos

ఈ దాడిలో చాలామంది గాయపడ్డారు.. శాంతిభద్రతల దృష్ట్యా రవాణా వ్యవస్థను నిలిపివేశారు.. రోడ్లపై ఎలాంటి వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు. దీనిపై పలు ఆరోపణలు రావడంతో పోలీసులు స్పందించారు.. ఫ్యాన్స్ షాపులపై దాడులకు పాల్పడ్డారని.. ఆస్తుల ధ్వంసానికి ప్రయత్నించారని.. తమపై రాళ్ల దాడి చేయడంతోనే తాము టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లు ఉపయోగించాల్సి వచ్చిందని రియోట్ పోలీసులు స్పష్టం చేశారు.

click me!