ఫిఫా 2018 ఫైనల్: ఫ్రాన్స్ vs క్రొయేషియా హైలెట్ పాయింట్స్

 |  First Published Jul 16, 2018, 12:17 PM IST

ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించి. రెండవ సారి ఛాంపియన్‌గా నిలిచింది. ఎటాకింగ్‌తో పాటు దుర్భేద్యమైన రక్షణ శ్రేణితో ప్రత్యర్థిని ఒత్తడిలోకి నెట్టి రెండు దశాబ్ధాల నిరీక్షణకు తెరదించింది.


ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించి. రెండవ సారి ఛాంపియన్‌గా నిలిచింది. ఎటాకింగ్‌తో పాటు దుర్భేద్యమైన రక్షణ శ్రేణితో ప్రత్యర్థిని ఒత్తడిలోకి నెట్టి రెండు దశాబ్ధాల నిరీక్షణకు తెరదించింది. ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి.. అవేంటో ఒకసారి చూస్తే..

* ఫ్రాన్స్ జట్టు విశ్వవిజేతగా నిలవడంలో కోచ్ దిదియర్ డెచాంప్స్‌ది మరువలేని పాత్ర. కెప్టెన్‌గా.. కోచ్‌గా జట్టుకు వరల్డ్‌కప్ సాధించిన ఆటగాడిగా దిదియర్ రికార్డుల్లోకి ఎక్కారు. అంతకు ముందు బ్రెజిల్‌కు చెందిన జగాలో, జర్మనీకి చెందిన బ్రెకన్‌బాయర్‌లు కెప్టెన్‌గా.. కోచ్‌గా తమ జట్లకు కప్‌ను సాధించి పెట్టారు.

Latest Videos

undefined

* ఫ్రాన్స్ యువ కెరటం కైలిన్ ఎంబాపె ఈ ప్రపంచకప్‌లో తన దూకుడైన ప్రదర్శన ద్వారా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.. ఫైనల్ మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా.. పిలే తర్వాత అతి పిన్న వయస్సులో వరల్డ్‌కప్‌ ఫైనల్లో గోల్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె రికార్డుల్లోకి ఎక్కాడు.. 

* మేజర్ టోర్నమెంట్లలో ఫ్రాన్స్ తరపున గ్రీజ్‌మెన్ ఇప్పటి వరకు 10 గోల్స్ కొట్టాడు..  అంతకు ముందు మరో ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.

* క్రొయేషియా ఆటగాడు ముంజుకిక్ సెల్ఫ్ గోల్ కొట్టడం ఫైనల్లో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన.. 18వ నిమిషంలో ముంజుకిక్ హెడర్‌తో సెల్ఫ్ గోల్ కొట్టడం ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో సెల్ఫ్ గోల్ నమోదు చేసిన ఆటగాడిగా ముంజుకిక్ రికార్డుల్లోకి ఎక్కాడు.

* ఇవాన్ పెర్సిక్ క్రొయేషియా సాధించిన 11 గోల్స్‌లో కీలకపాత్ర పోషించాడు.. 

"

click me!