3-4 తేడాతో మెస్సీ టీమ్ ఇంటికి
రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అర్జెంటీనా కథ ముగిసింది. ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య శనివారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన తొలి ప్రీ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ అర్జెంటీనాపై 4-3 తేడాతో గెలుపొందింది. విజయంలో కీలమైన రెండు గోల్స్ చేసిన కైలియాన్ ఎంబాప్పే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆట ఆరంభం నుంచే అదిరిపోయేలా సాగింది. ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగిన మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠపరిచింది. ఆ హోరాహోరీ పోరు ఎంతదాకా వెళ్లిందంటే.. 11వ నిముషంలో అర్జెంటీనా ప్లేయర్ రోగో.. ఫ్రాన్స్ టీనేజర్ ఎంబాప్పేను కావాలనే తోసేసేదాకా. దాంతో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీని గ్రీజ్‌మన్ గోల్‌గా మార్చాడు. జట్టుకు 1-0 ఆధిక్యాన్ని కట్టబెట్టాడు.
undefined
అక్కడి నుంచి 41వ నిముషం దాకా మ్యాచ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించింది. అప్పుడే అర్జెంటీనా ప్లేయర్ అంజెల్ డి మారియా గోల్ చేశాడు. ఫస్టాఫ్ ముగిసేసరికి 1-1తో ఇరు జట్లు స్కోరును సమం చేశాయి.
సెకండాఫ్ మొదలైన మూడు నిముషాలకే అంటే 48వ నిముషంలో గాబ్రియల్ మెర్కాడో చేసిన గోల్‌తో ఆటపై అర్జెంటీనా ఆధిక్యం 2-1కు చేరుకుంది. దీంతో ఎంబాప్పే చెలరేగిపోయాడు. 64, 68 నిముషాల్లో రెండు గోల్స్ చేశాడు. 4-2 తేడాతో గేమ్‌పై ఫ్రాన్స్‌కు గ్రిప్ వచ్చేలా దూకుడు పెంచాడు.
ఆ తర్వాత అర్జెంటీనా ప్లేయర్స్ గోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఫ్రాన్స్ ఆటగాళ్ళు అడుగడుగునా అడ్డు తగులుతూ ఆటను రక్తి కట్టించారు. అర్జెంటీనా ప్లేయర్ సెర్గియో అగురియో అదనపు సమయంలో గోల్ చేసి జట్టుకు మూడో గోల్ అందించాడు. ఆట ముగిసే సమయానికి ఫ్రాన్స్ 4-3తో అర్జెంటీనాపై విజయం సాధించింది.