
నాటింగ్‌హామ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 40.1 ఓవర్లలోనే 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.కేవలం రెండు వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్ రోహిత్ శర్మ 137 పరుగులు చేసి భారత్‌ను అలవోకగా గెలిపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 పరుగులు చేసి అవుటయ్యాడు. శిఖర్ ధావన్ 40 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 9 పరుగులు చేశాడు.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా గురువారంనాటి తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ ఇరగదీశాడు. భారీ స్కోరు సాధిస్తుందని భావించిన ఇంగ్లాండును అతను తన బౌలింగ్ తో కట్టడి చేశాడు. ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండును 268 పరుగులకు కట్టడి చేయడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు.
ఓ బంతి మిగిలి ఉండగానే 49.5 ఓవర్లకు ఇంగ్లాండు భారత్ పై 268 పరుగులు చేసింది. దీంతో విజయం కోసం భారత్ 269 పరుగులు చేయాల్సి ఉంటుంది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత రికార్డును నమోదు చేశాడు. తన బౌలింగ్‌తో కుల్దీప్ ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ ను ముప్పు తిప్పలు పెట్టాడు.
కుల్దీప్ ఈ మ్యాచ్‌లో ఫైవ్ వికెట్ హౌల్‌ని సాధించాడు. దానికితోడు అంతర్జాతీయ వన్డేల్లో ఒక మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన తొలి ఎడమచేతి స్పిన్నర్‌గా కుల్దీప్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. రాయ్, బ్రిస్టో, రూట్, స్టోక్స్, బట్లర్, విల్లీ వికెట్లు తీశాడు. కాగా ఇది కుల్దీప్ వన్డే కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన.
ఇంగ్లాండు ఓపెనర్లు శుభారంభాన్ని అందించినప్పటికీ ఆ తర్వాత కుల్దీప్ దెబ్బకు వికెట్లు కుప్పకూలుతూ వెళ్లాయి. బెన్ స్టోక్స్ అర్ధశతకాన్ని నమోదు చేసిన వెంటనే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పది ఓవర్లు ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేశారు. అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఆ తర్వాత చాహల్ బౌలింగ్‌లో కెప్టెన్ మోర్గన్ కూడా పెవిలియన్ చేరాడు.
ఈ దశలో స్టోక్స్, బట్లర్‌ల జోడీ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కి 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో బట్లర్ 46 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అయితే అర్థశతకాన్ని నమోదు చేసిన కొంత సమయానికే బట్లర్(53) కుల్దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
బెన్ స్టోక్స్ వికెట్ ను కాపాడుకునే క్రమంలో నెమ్మదిగా ఆడి 103 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 50 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత కుల్దీప్ వేసిన 45వ ఓవర్ తొలి బంతికి సిద్ధార్త్ కౌల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. 46 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆ తర్వాత 268 పరుగులకు ఇంగ్లాండు అన్ని వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఆరు వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్ రెండు, చాహల్ ఒక వికెట్ తీశారు. ప్లంకెట్ రన్నవుట్ అయ్యాడు.