FIFA World Cup: నెయ్మార్ లేకుండానే బరిలోకి బ్రెజిల్.. తొలి మ్యాచ్‌కు ముందు పెరిగిన ఆందోళన

Published : Jun 13, 2026, 08:11 PM IST
 Brazil vs Morocco

సారాంశం

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026లో బ్రెజిల్ తొలి మ్యాచ్‌ను మొరాకోతో ఆడనుంది. ఈ కీలక పోరుకు ముందు బ్రెజిల్ అభిమానులకు నిరాశ కలిగింది. స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మార్‌ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమవుతున్నట్లు కోచ్ అధికారికంగా ప్రకటించారు. 

నెయ్మార్ గైర్హాజరు.. బ్రెజిల్‌కు పెద్ద పరీక్ష

గత మూడు ప్రపంచకప్‌లలో బ్రెజిల్ జట్టు వ్యూహాలన్నీ నెయ్మార్ చుట్టూనే తిరిగాయి. 2014లో అద్భుత ఫామ్‌లో ఉన్న సమయంలో గాయం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. 2018లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. 2022లో క్రొయేషియాపై నెయ్మార్ గోల్ చేసినా, చివరకు పెనాల్టీల్లో బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మరోసారి గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్ ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరగనుంది.

యువ ఆటగాళ్లపై బ్రెజిల్ ఆశలు

నెయ్మార్ లేకపోయినా బ్రెజిల్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్ల కొరత లేదు. ముందువరుసలో రఫిన్హా, వినిసియస్ జూనియర్, మాథ్యూస్ కున్హామెరుగైన ఫామ్‌లో ఉన్నారు. అలాగే ఎండ్రిక్, ఇగోర్ థియాగో వంటి యువ ఆటగాళ్లు కూడా ఆశలు రేకెత్తిస్తున్నారు. మిడ్‌ఫీల్డ్‌లోకాసేమిరో, బ్రూనో గిమారెస్, లూకాస్ పక్వెటా కీలక పాత్ర పోషించనున్నారు.

మొరాకోను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు

మొరాకో నేష‌న‌ల్ ఫుట్‌బాల్ టీమ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. కెప్టెన్ అష్రఫ్ హకీమ్, స్టార్ ఫార్వర్డ్ బ్రాహిమ్ డియాజ్ జట్టుకు ప్రధాన బలంగా ఉన్నారు. గత ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన మొరాకో ఈసారి కూడా డార్క్ హార్స్‌గా బరిలోకి దిగుతోంది. సమష్టి ఆటతో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఆ జట్టుకు ఉంది.

గత రికార్డులు ఏమి చెబుతున్నాయి?

బ్రెజిల్, మొరాకో జట్లు ఇప్పటివరకు రెండుసార్లు తలపడ్డాయి. 2002 ప్రపంచకప్‌లో బ్రెజిల్ విజయం సాధించింది. అయితే మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మొరాకో బ్రెజిల్‌కు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. నెయ్మార్ లేకపోయినా బ్రెజిల్ తన బలాన్ని నిరూపిస్తుందా? లేక మొరాకో మరో సంచలనం సృష్టిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే