ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం అందుకున్న పోర్చుగల్... తలకు తగలకుండా గోల్ కోసం అప్పీలు చేసిన రొనాల్డో... క్రిస్టియానో రొనాల్డోపై తీవ్రమైన ట్రోలింగ్..
ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో పోర్చుగల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కి ప్రవేశించింది. ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం అందుకున్న పోర్చుగల్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రీక్వార్టర్స్‌కి చేరింది. పోర్చుగల్ ప్లేయర్ బ్రూనో ఫెర్నాండెస్ ఆట 54వ నిమిషంలో తొలి గోల్ చేసి, పోర్చుగల్‌కి 1-0 తేడాతో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పూర్తి సమయం వరకూ ఇరుజట్ల ప్లేయర్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు...
ఎక్స్‌ట్రా టైమ్‌లో ఆట 93వ నిమిషంలో దక్కిన పెనాల్టీని చక్కగా వాడుకున్న బ్రూనో ఫెర్నాండెస్ మరో గోల్ సాధించి పోర్చుగల్‌కి 2-0 తేడాతో విజయం అందించాడు. అయితే 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండేస్ చేసిన గోల్ విషయంలో వివాదం రేగింది. ఫెర్నాండేస్ కొట్టిన షాట్‌ని గోల్ పోస్ట్‌లోకి పంపేందుకు గాల్లోకి ఎగిరాడు క్రిస్టియానో రొనాల్డో. బంతి తన తలకి తగిలి, గోల్ వెళ్లినట్టుగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు...
fans, do answer this 👇
Did the ⚽ hit before it went inside the 🥅 or not? 🤔 pic.twitter.com/58AxS2Bb11
undefined
అయితే టీవీ రిప్లైలో మాత్రం బంతి, క్రిస్టియానో రొనాల్డో తలకు తగలలేదని క్లియర్‌గా కనిపించింది. గోల్ వచ్చిన తన టీమ్‌కే అయినప్పటికీ తనకి గోల్ ఇవ్వకపోవడంపై క్రిస్టియానో రొనాల్డో అసహనం వ్యక్తం చేశాడు. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది...
క్రిస్టియానో రొనాల్డో తల మీది జుట్టులో ఓ వెంట్రుక, బంతికి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రొనాల్డో నెత్తి మీది వెంట్రుకకి కూడా గోల్ చేసే పవర్ ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్. మెస్సీ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాకి అదే రేంజ్‌లో రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు రొనాల్డో ఫ్యాన్స్. ఇంతకుముందు మెస్సీ చేసిన ఛీటింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు...
డిసెంబర్ 3న పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ దక్షిణ కొరియాతో ఆడనుంది.ఈ మ్యాచ్‌లో ఓడినా పోర్చుగల్‌కి పెద్ద ప్రమాదమేమీ ఉండదు. గ్రూప్ హెచ్‌లో 2 మ్యాచులాడి రెండు విజయాలు అందుకున్న పోర్చుగల్‌తో పాటు గ్రూప్ జీ నుంచి బ్రెజిల్, గ్రూప్ డీ నుంచి ఫ్రాన్స్, గ్రూప్ బీ నుంచి ఇంగ్లాండ్, గ్రూప్ ఏ నుంచి నెదర్లాండ్స్, సెనెగల్ జట్లు ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాయి..