గుండె సమస్యనే లెక్కచేయకుండా ఆడుతున్న డచ్ ఫుట్‌బాల్ స్టార్... చిన్న దెబ్బ తగిలితే ఆడలేరా అంటూ!

By Chinthakindhi RamuFirst Published Dec 10, 2022, 12:04 PM IST
Highlights

అరుదైన గుండె సమస్యతో పోరాడుతూనే ఫిఫా వరల్డ్ కప్ ఆడిన నెదర్లాండ్స్ ప్లేయర్ డేలీ బ్లైండ్... క్వార్టర్ ఫైనల్‌లో అర్జెంటీనా చేతుల్లో ఓడిన నెదర్లాండ్స్.. 

టీమిండియాకి ఇప్పుడున్న సమస్యలు గాయాలు, ఫిట్‌నెస్, ఫామ్‌లో లేకపోవడం కాదు... గెలవాలనే కసి, అంకితభావం లోపించడమే! బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ టీమిండియా ఆటతీరులో ఇది కనిపించింది. చిన్న దెబ్బ తగిలితే చాలు, ప్లేయర్లకు ఆడలేమని సిరీస్‌లకు సిరీస్‌లకు దూరమవుతున్నారు. అయితే నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ ప్లేయర్ డేలీ బ్లైండ్ మాత్రం గుండె సమస్యతో పోరాడుతూ వరల్డ్ కప్ ఆడాడు...

ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరిన నెదర్లాండ్స్ జట్టు, అర్జెంటీనా జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 3-4 తేడాతో  ఓడింది. అయితే ఆఖరి వరకూ నెదర్లాండ్స్ టీమ్ చూపించిన పోరాటం, ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ మనసులు గెలుచుకుంది...

నెదర్లాండ్స్ ఫుట్‌బాల్‌ టీమ్ తరుపున ఆడిన డైలీ బ్లైండ్... ఓ గుండె సంబంధిత సమస్యతో బాధుపడుతున్న విషయం తెలిసి, ఫుట్‌బాల్ ప్రపంచం షాక్‌కి గురైంది. అర్జెంటీనాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు డైలీ బ్లైండ్ డీఫిబ్రిలేషన్ వాడి బరిలో దిగాడు... ఇది ఎందుకు వాడతారు? డైలీ బ్లైండ్‌కి ఉన్న సమస్య ఏంటి?

ఫుట్‌బాల్ అంటేనే పరుగు, వేగం... అయితే డైలీ బ్లైండ్‌కి ఉన్న సమస్య ఈ వేగంతోనే... డైలీ బ్లైండ్ ఓ అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వేగంగా పరుగెత్తితే ఆయాసం రావడం అందరికీ జరుగుతుంది. అయితే డైలీ బ్లైండ్‌కి ఉన్న వ్యాధితో బాధపడుతున్నవారికి ఆయాసంతో పాటు శ్వాస ఆగిపోయి, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది...


అందుకే ఫిఫా వరల్డ్ కప్ 2022 సమయంలో తన గుండె ఆగిపోకుండా ఉండేందుకు డిఫిబ్రిలేషన్ మెషిన్‌తో తన ప్రాణం కాపాడుకుంటూ వస్తున్నాడు డైలీ బ్లైండ్. మూడేళ్లుగా డైలీ బ్లైండ్ ఈ సమస్యతో పోరాడుతున్నాడు. 2019 ఛాంపియన్స్ లీగ్ సమయంలో ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలోనే డైలీ బ్లైండ్‌కి గుండెపోటు వచ్చింది...

మైదానంలో కుప్పకూలిపోయిన నెదర్లాండ్స్ ప్లేయర్‌ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి, ప్రాణాలు కాపాడగలిగారు నిర్వాహకులు. ప్రాణం నిలవాలంటే ఫుట్‌బాల్ ఆటను వదులుకోవాలని వైద్యలు హెచ్చరించారు. అయితే డైలీ బ్లైండ్ మాత్రం ప్రాణం కంటే ఫుట్‌బాల్ ఆటే ముఖ్యమంటూ మొండిగా పోరాడుతున్నాడు...

రౌండ్ 16లో యూఎస్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేసిన డైలీ బ్లైండ్, తన తండ్రి డానీ బ్లైండ్ దగ్గరికి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. యూఎస్‌పై 3-1 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరిన నెదర్లాండ్స్, సెమీఫైనల్‌కి మాత్రం అర్హత సాధించలేకపోయింది. మాంచెస్టర్ ప్లేయర్ క్రిస్టియన్ ఎర్కిసన్ కూడా డిఫ్రిబ్రిలేటర్ వాడుతున్నాడు. 

డైలీ బ్లైండ్ ప్రాణాలకు లెక్కచేయకుండా ఫుట్‌బాల్ మీద ప్రేమతో దేశం తరుపున ఆడుతున్నప్పుడు భారత క్రికెటర్లు, చిన్న దెబ్బలను సాకుగా చూపించి టీమిండియా ఆడే మ్యాచులకు దూరమవ్వడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్ ఆడేటప్పుడు కోట్లు తీసుకుంటూ గాయాలను లెక్కచేయకుండా ఆడుతున్న ప్లేయర్లు, దేశం తరుపున ఆడమంటే మాత్రం బిజీ షెడ్యూల్ పేరు చెప్పి రెస్ట్ కావాలని తప్పించుకుంటున్నారని ట్రోల్ చేస్తున్నారు.. 

click me!