Fifa World cup 2022 క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెజిల్‌ని ఓడించిన క్రొయేషియా... నెదర్లాండ్స్‌పై విజయం అందుకున్న అర్జెంటీనా...
ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటైన బ్రెజిల్‌కి ఊహించని షాక్ తగిలింది. అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్‌కి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా షాక్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్‌లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తో ఓడి... ఇంటిదారి పట్టింది బ్రెజిల్...
రికార్డు స్థాయిలో ఏడు సార్లు ఫైనల్ చేరిన బ్రెజిల్, ఐదు సార్లు టైటిల్ గెలిచి ఫిఫా వరల్డ్ కప్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది. చివరిగా 2002లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్, ఆ తర్వాత స్వదేశంలో జరిగిన 2014 ఫిఫా వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ వరకూ వెళ్లగలిగింది...
undefined
2006, 2010, 2018 టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ నుంచే నిష్కమించిన బ్రెజిల్, 2022 సీజన్‌లోనూ అదే రిజల్ట్‌ని రిపీట్ చేసింది. ఇరు జట్లు పూర్తి సమయం ముగిసే వరకూ గోల్స్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రా టైమ్‌లో నేమర్ జూనియర్ గోల్ చేసి బ్రెజిల్‌కి 1-0 ఆధిక్యం అందించాడు. అయితే ఆ తర్వాత క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్వోనిక్ గోల్ చేసి స్కోర్లను 1-1 తేడాతో సమం చేశాడు...
దీంతో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్లను ఎంచుకున్నారు రిఫరీ. ఇందులో బ్రెజిల్ 2 సార్లు గోల్ చేయగా క్రొయేషియా 4 సార్లు బంతిని గోల్‌లోకి పంపగలిగింది. దీంతో 4-2 తేడాతో క్రొయేషియా... సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది... క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమర్ జూనియర్... చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కదిలించి వేసింది...
మరోవైపు అర్జెంటీనా కూడా అంచనాలకు మించి రాణిస్తూ సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. నెదర్లాండ్స్- అర్జెంటీనా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగింది..
What it means ❤️🇦🇷 | pic.twitter.com/Ajwy4AdBdy
— FIFA World Cup (@FIFAWorldCup)నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. ఆట 35వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు నహెల్ మోలినా గోల్ చేసి 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఆట 73వ నిమిషంలో లియోనెల్ మెస్సీ, పెనాల్టీ కార్నర్‌ని అద్భుతంగా వాడుకుంటూ గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనాకి 2-0 ఆధిక్యం దక్కింది...
అయితే ఆట 83వ నిమిషంలో గోల్ చేసిన నెదర్లాండ్స్ ఆటగాడు వోట్ వెగోర్స్, ఎక్స్‌ట్రా టైమ్ 90+11లో మరో గోల్ చేసి స్కోర్లను 1-1 తేడాతో సమం చేశాడు. దీంతో ఫలితాన్ని రాబట్టేందుకు పెనాల్టీ షూటౌట్‌ని ఎంచుకున్నారు రిఫరీ. నెదర్లాండ్స్ 3 గోల్స్ చేయగా అర్జెంటీనా 4 గోల్స్ సాధించి 3-4 తేడాతో సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది...