హలో, యు ఆర్ మై ఎమ్మెల్యే.. అంటూ పాటలు పాడుకుంటున్న జడ్డూ..

Published : Dec 09, 2022, 05:00 PM IST
హలో, యు ఆర్ మై ఎమ్మెల్యే.. అంటూ పాటలు పాడుకుంటున్న జడ్డూ..

సారాంశం

Gujarat Election Results 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి.  ఈ ఎన్నికలలో భాగంగా జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి  పోటీ చేసిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా  బంపర్ మెజారిటీతో గెలిచింది.

బంగ్లాదేశ్ టూర్‌కు డుమ్మా కొట్టి మరీ  భార్యను గెలిపించుకున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. గాయాన్ని సాకుగా చూపిన జడ్డూ.. భార్య ఎన్నికల క్యాంపెయిన్ లో చురుకుగా పాల్గొన్నాడు.  గుజరాత్ లోని జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి  పోటీ చేసిన  రివాబా.. తన సమీప ప్రత్యర్థి, ఆప్ అభ్యర్థి కర్షన్ ‌భాయ్‌పై సుమారు 53 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది.  

జామ్‌నగర్ లో రివాబా గెలిచిన తర్వాత  రవీంద్ర జడేజా  ట్విటర్ వేదికగా  తన భార్యకు  శుభాకాంక్షలు తెలిపాడు. ‘హలో ఎమ్మెల్యే..’ అంటూ ట్వీట్ చేశాడు. గుజరాతీలో  ట్వీట్ చేసిన జడేజా.. ఇకనుంచి జామ్‌నగర్ ప్రజల కష్టాలు తీరుతాయని   ఆకాంక్షించాడు. 

ట్విటర్ వేదికగా జడేజా స్పందిస్తూ.. ‘హలో ఎమ్మెల్యే.. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి.  జామ్‌నగర్ ప్రజలు గెలిచారు.  ఈ సందర్భంగా  ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక నుంచి జామ్‌నగర్ పనులన్నీ జామ్ జామ్ గా సాగిపోతాయి..’అని ట్వీట్ చేశాడు.  ట్విటర్ లో  రివాబాతో కలిసున్న  ఫోటోలో ‘ఎంఎల్ఎ గుజరాత్’అని రాసి ఉన్న ప్లేట్ తో జడేజా ఈ ట్వీట్ చేశాడు. 

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన హరి సింగ్ సోలంకి కుటుంబానికి బంధువులైన రివాబా జడేజా, 2019లో భారతీయ జనతా పార్టీలో చేరింది. రవీంద్ర జడేజా కుటుంబం కూడా ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్ధతుదారులుగా ఉన్నారు. రివాబా మామ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. జడేజా సోదరి నయబా జడేజా, కాంగ్రెస్‌లో ఉంటూ ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారం కూడా చేసింది..

గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీ మధ్యలో నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కూడా జట్టుకి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ నుంచి దూరంగా ఉన్నాడు జడ్డూ. అయితే భార్యతో కలిసి ప్రచారంలో జోరుగా పాల్గొన్నాడు రవీంద్ర జడేజా. అంతేకాకుండా రివాబా ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన కరపత్రాల్లోనూ రవీంద్ర జడేజా ఫోటోలను ముద్రించారు. మామూలు దుస్తుల్లో ఉంటే సాధారణ ప్రజానీకం గుర్తుపడతారో లేదోనని టీమిండియా జెర్సీలోనే ఫోజులిచ్చాడు జడ్డూ...

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం