కెప్టెన్‌ డోపింగ్ వివాదం మధ్య 36 ఏళ్లకు పెరు రీ ఎంట్రీ

First Published Jun 5, 2018, 5:20 PM IST
Highlights

కెప్టెన్‌ డోపింగ్ వివాదం మధ్య 36 ఏళ్లకు పెరు రీ ఎంట్రీ 

హైదరాబాద్: మరో తొమ్మిది రోజుల్లో మాస్కో వేదికగా సాకర్ సంరంభం ప్రారంభం కానున్నది. అండీ పర్వత శిఖరాలు మొదలు అమెజాన్ అడవుల వరకు పెరూ వాసులంతా ‘సాకర్ కప్’ సంరంభం కోసం ఆసక్తిగా, ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అయితే స్టార్ ప్లేయర్ జట్టు సారధి డోపింగ్ వివాదంతో పాలో గౌర్రెరో గైర్హాజరీలో ఉండగా తమ జట్టు విజయావకాశాలపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అర్హత సాధించి ఆరంగ్రేటం చేస్తోంది. 

సారథి గౌర్రెరో లేకుండానే పెరు ప్రాతినిధ్యం ఇలా
డోపింగ్ ఆరోపణలతో కెప్టెన్ పాలో గౌర్రెరో లేకుండా, అర్జెంటీనా మాజీ ఇంటర్నేషనల్ కం కోచ్ రికర్డో గారెసా సారథ్యంలో తాము సాధించిన అర్హతకు తగినట్లు ఆడతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పెరువియన్ ఫుట్‌బాలర్లకు హీరోగా నిలిచిన మేనేజర్ రికర్డో గారెసా సారథ్యంలో కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్న పెరు ఆటగాళ్లు తాము ఎదుర్కొన్న అన్ని అడ్డంకులకు పిచ్‌పై సమాధానం చెబుతామంటున్నారు. 

16న డెన్మార్క్ జట్టుతో తలపడనున్న పెరు
గ్రూపు సీలో ఉన్న పెరు ఈ నెల 16న సరాన్స్క్‌లో డెన్మార్క్ జట్టుకు వ్యతిరేకంగా జరిగే మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసింది. తదుపరి యాకతరింగ్ బర్గ్ టీంపై 21వ తేదీన ఫ్రాన్స్ జట్టుతో, 26న సోచిలో ఆస్ట్రేలియా జట్టుపై ఆడనున్నది. గతేడాది అక్టోబర్ ఐదో తేదీన అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో పెరు కెప్టెన్ పాలో గౌర్రెరో కొకైన్ సేవించినట్లు డ్రగ్స్ తనిఖీలో తేలింది. తొలుత ఏడాది పాటు నిషేధం విధించిన వాడ.. గత డిసెంబర్ నెలలో దాన్ని ఆరు నెలలకు తగ్గించింది. దాని ప్రకారమైనా గత నెల మూడో తేదీన ఆ నిషేధం గడువు ముగిసిపోయింది. దీంతో గౌర్రెరో ఈ నెల 14 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు రష్యా వరల్డ్ కప్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధించినట్లయింది. 

                             
ఇలా పాలోపై నిషేధం గడువు పెంచిన వాడా
కానీ పాలో గౌర్రెరో తనపై నిషేధాన్ని రద్దు చేయాలని స్విస్ కేంద్రంగా పని చేస్తున్న మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం వరల్డ్ యాంటీ డోపింగ్ బాడీకి నచ్చలేదు. స్విస్ న్యాయస్థానం ఆదేశాలు భేఖాతరు చేసి గౌర్రెరోపై విధించిన నిషేధాన్ని రెట్టింపు చేసింది. దీనిపై పెరు ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఎడ్విన్ ఓవైడో ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ ఫాంటినోతో భేటీ అయినా నిష్ర్పయోజనమైంది. స్విస్ కేంద్రంగా పని చేస్తున్న న్యాయస్థానం తుది ఆదేశాలు వచ్చే వరకు తామేం చేయలేమని జియాన్నీ తేల్చేశారు. గత నెల 25వ తేదీన స్విస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా సానుకూల పరిస్థితులు తలెత్తలేదు. ఫలితంగా టోర్నమెంట్ సందర్భంగా వివిధ దేశాలతో పెరు ఆడే మ్యాచ్ లను ఆయన కేవలం వీక్షించడానికే పరిమితం కానున్నారు.             

                               

 

1982లో స్పెయిన్ టోర్నీలో చివరి సారిగా పెరు ప్రాతినిధ్యం
చివరిగా స్పెయిన్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో 1982లో పెరు పాల్గొన్నది. నాటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సాకర్ కప్ టోర్నమెంట్లు జరిగాయి. 1982, 1978 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ఆడిన పెర్సీ రోజాస్ మాట్లాడుతూ సాకర్ కప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ కోర్సు వంటిదన్నాడు. అంతకుముందు 1930లో తొలుత ఉరుగ్వేలో జరిగిన సాకర్ కప్ టోర్నీలో పెరూ ఆరంగ్రేటం చేసింది. 1970, 1978 టోర్నమెంట్లలో ఆడిన పెరు 1982 టోర్నీలో ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఓటమి పాలైంది. 

                            


1982 టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఓటమి పాలైన పెరు తర్వాత సాకర్ కప్‌లో అడుగు పెట్టడం ఇదే ప్రథమం. 1930లో ఉరుగ్వేలో సాకర్ కప్ సంరంభంలో ఆరంగ్రేటం చేసింది. డోపింగ్ వివాదాన్ని ఎదుర్కొంటున్న గౌర్రెరో విషయంలో తామేం చేయలేమని ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ ఫాంటినో తేల్చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో కొకైన్ వాడాడని పాలో గౌర్రెరోపై అభియోగం. తొలుత ఏడాది పాటు నిషేధం విధించిన వాడా తర్వాత అభ్యర్థన మేరకు ఆరు నెలలకు తగ్గించింది. తాజాగా దాన్ని 14 నెలలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. 

click me!