‘‘ఫోటో బాగుంది.. కానీ..’’

Published : Jun 05, 2018, 03:03 PM IST
‘‘ఫోటో బాగుంది.. కానీ..’’

సారాంశం

కోహ్లీ అనుష్క ఏది?

టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటూ.. అభిమానులతో టచ్ లో ఉంటారు. ప్రస్తుతం కోహ్లీ క్రికెట్ ని దూరంగా ఉంటూ.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. 

 అసలైతే  కోహ్లీ ఇంగ్లాండ్‌ వెళ్లి కౌంటీ క్రికెట్‌ ఆడాల్సి ఉంది. కానీ  ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆడిన చివరి మ్యాచ్‌లో కోహ్లీ మెడకు గాయమైంది.  దీంతో.. ఆ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. 

 ఇక అసలు విషయానికి వస్తే  తాజాగా కోహ్లీ తన ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలో కోహ్లీతో పాటు అతడి తల్లి, సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. ఐతే, ఇందులో కోహ్లీ భార్య అనుష్క శర్మ లేదు.

 

 దీంతో అభిమానులు ‘కోహ్లీ..అనుష్క ఏది? ఎక్కడికి వెళ్లింది?’ అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతేకాదు ‘ఫొటో బాగుంది కానీ అనుష్క ఉంటే ఇంకా బాగుండేది; ఫొటోలో ఒకరు మిస్సయ్యారు; కోహ్లీ సోదరి కుమారుడు చూడ్డానికి కోహ్లీలానే ఉన్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే