బాలికలను అలా వేధిస్తున్నారంటూ ఆరోపణలు... ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య...

By team telugu  |  First Published Feb 26, 2021, 11:53 AM IST

లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మాజీ జిమ్నాస్టిక్ కోచ్ జాన్ గెడ్డార్ట్ ఆత్మహత్య...

ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ కోచ్‌గా వ్యవహారించిన జాన్ గెడ్డార్ట్...

ఒలింపిక్ కోచ్‌గా ఉన్న సమయంలో లైంగికంగా వేధించేవాడంటూ జాన్ గెడ్డార్ట్‌పై ఆరోపణలు..


లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్ కోచ్ జాన్ గెడ్డార్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి సమీపంలో జరిగింది. ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ కోచ్‌గా వ్యవహారించిన జాన్ గెడ్డార్ట్, మిచిగన్ ఏరియాలో ఓ మహిళా జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.

ఈ సెంటర్‌లోనే డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లారీ నాసర్, కోచ్ జాన్ గెడ్డార్ట్‌ కలిసి జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ కోసం వచ్చిన బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు మానసికంగా కూడా హింసించేవారంటూ నాసల్ అనే ఓ వ్యక్తి, సంచలన ఆరోపణలు చేశాడు.

Latest Videos

undefined

నాసల్ ఆరోపణలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 13, 16 ఏళ్ల లోపు బాలికలపై జాన్ గెడ్డార్ట్‌, నాసర్‌ లైంగికంగా వేధించేవారని తేల్చారు.

ఓ బాలిక తల్లి కూడా తన కూతురు, ఈ విషయాలు చెప్పుకొని ఏడ్చిందని తెలియచేసింది. ఇదిలా ఉండగా మాజీ జిమ్నాస్ట్ రాచెల్ డెస్‌ హోలాండర్, గెడ్డార్ట్ ఒలింపిక్ కోచ్‌గా ఉన్న సమయంలో లైంగికంగా వేధించేవాడంటూ 21 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను బయటపెట్టింది. 
 

click me!