గుండెపోటుతో క్రికెటర్ మృతి... బ్యాటింగ్ చేస్తూనే

Published : Jan 14, 2019, 10:03 AM IST
గుండెపోటుతో క్రికెటర్ మృతి... బ్యాటింగ్ చేస్తూనే

సారాంశం

గోవా రంజీ జట్టులో విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టుకు చెందిన ఆటగాడు రాజేశ్ ఘోడ్గే (43) స్థానికంగా జరిగే ఓ టోర్నమెంట్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతిచెందాడు.  

గోవా రంజీ జట్టులో విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టుకు చెందిన ఆటగాడు రాజేశ్ ఘోడ్గే (43) స్థానికంగా జరిగే ఓ టోర్నమెంట్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతిచెందాడు.

ఆదివారం దక్షిణ గోవాలో జరిగిన మార్గావ్ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్ మ్యాచ్‌లో ఓ స్థానిక జట్టు తరపున రాజేశ్ ఘోడ్గే బరిలోకి దిగాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బరిలోకి దిగిన అతడు 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. 

దీంతో అతన్ని టోర్నీ నిర్వహకులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు వదిలినట్టు డాక్టర్లు తెలిపారు. రాజేశ్ మృతి పట్ల అతడి తోటి  ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేశారు.  
 
PREV
click me!

Recommended Stories

RCB : ఆర్సీబీ మాస్ బ్యాటింగ్.. యూపీ బౌలర్లకు చుక్కలే ! గ్రేస్ హారిస్ సునామీ ఇన్నింగ్స్
Sophie Shine : రోహిత్ శర్మ నిద్ర చెడగొట్టిన ఆ అమ్మాయి ఈమేనా? ధావన్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!