‘‘గే’’నే అయితే తప్పేంటీ.. విండీస్ క్రికెటర్‌కు జో రూట్ కౌంటర్

By Siva KodatiFirst Published Feb 12, 2019, 1:56 PM IST
Highlights

ప్రస్తుతం వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ 154 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు దూసుకెళ్తోంది.

ప్రస్తుతం వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ 154 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు దూసుకెళ్తోంది.

అప్పటికే అసహనంతో ఉన్న విండీస్ బౌలర్ షానన్ గాబ్రియల్ ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. స్టంప్స్‌లో ఉన్న మైకుల్లో ఇవి రికార్డయ్యాయి. గాబ్రియల్ చేసిన వ్యాఖ్యల్లో స్పష్టత లేనప్పటికీ.. రూట్ మాత్రం ‘‘గే’’నే అయితే తప్పేంటి అంటూ సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డయ్యింది.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రూట్ ... గాబ్రియల్ చేసిన వ్యాఖ్యలు తప్పని అనిపిస్తే, అతనే క్షమాపణలు కోరాలి. పలు సందర్భాల్లో ఆన్‌ఫీల్డ్ మాటల యుద్ధం అనేది ఆటలో సహజమే.. కానీ వారు ఏదైతే అన్నారో దానికి కట్టుబడి ఉండాలి. అదే సమయంలో క్షమాపణలు కోరే తత్వం కూడా ఉండాలని జోరూట్ తెలిపాడు.

మరోవైపు గాబ్రియల్ వ్యాఖ్యలపై రూట్ ఐసీసీకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే ఇంగ్లాండ్‌కు కోల్పోయిన వెస్టిండీస్ మూడో టెస్టులో మాత్రం పట్టుబిగించింది. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లీష్ జట్టు.. బ్యాటింగ్‌లోనూ పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి.. 448 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

click me!