విజయ్ శంకర్‌కు ప్రపంచ కప్ జట్టులో స్థానం డౌటే: గంగూలి

By Arun Kumar PFirst Published Feb 11, 2019, 8:01 PM IST
Highlights

విదేశీ పర్యటనల్లో టీంఇండియా యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారని మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసించారు. తమకు వచ్చిన అరుదైన అవకాశాలను ఈ యువ క్రికెటర్లు ఒడిసిపట్టకుంటూ జట్టులో తమ స్థానాన్ని పదిలం చేసుకోడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్, విజయ్ శంకర్ లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించారని గంగూలీ పేర్కొన్నారు. 

అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ విజయ్ శంకర్ ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించడం చాలా కష్టమని గంగూలీ అభిప్రాయపడ్డారు. అతడు భారత్ తరపున వరల్డ్ కప్ ఆడతాడని తాను అనుకోవడం లేదని అన్నారు. రిషబ్ పంత్ కు ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా వున్నాయని గంగూలీ వెల్లడించారు. 

యువ క్రికెటర్లతో పాటు సీనియర్లు మహేంద్ర సింగ్ ధోని, బౌలర్ మహ్మద్ షమీ విదేశీ పర్యటనల ద్వారా  మంచి ఫామ్ లోకి వచ్చారన్నారు. గత సంవత్సరం మొత్తం ఫామ్ కోల్పోయి విఫలమైన ధోని ప్రపంచ కప్ కు ముందు జరిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో రాణించడం శుభ పరిణామమన్నారు. అనుభవం, ఆటతీరు దృష్ట్యా ధోని ప్రపంచకప్ లో భారత్ జట్టుకు అదనపు బలంగా మారనున్నాడని గంగూలీ పేర్కొన్నారు. 

ఇక మహ్మద్ షమీ ఈ మధ్య కాలంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మంచి నైపుణ్యమున్న బౌలర్ గా ఎదిగాడని గంగూలి తెలిపారు. అతడు ప్రపంచ కప్ భారత జట్టుకు వెన్నెముకగా మారనున్నాడని గంగూలీ పేర్కొన్నారు.  
 
click me!