Tokyo Olympics: క్వార్టర్స్ లోకి ప్రవేశించిన భారత రెజ్లర్ భజరంగ్ పూనియా

By team teluguFirst Published Aug 6, 2021, 9:13 AM IST
Highlights

భారత రెజ్లింగ్ పోస్టర్ బాయ్, స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా తొలి రౌండ్ లో విజయాన్ని సాధించి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు.

భారత రెజ్లింగ్ పోస్టర్ బాయ్, స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా తొలి రౌండ్ లో విజయాన్ని సాధించి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు. కిర్గిస్థాన్ రెజ్లర్ అక్మాథాలియెవ్ తో జరిగిన మ్యాచులో 3-3 తో స్కోర్లు సమంగా ఉన్నప్పటికీ... 2 పాయింట్ల అత్యధిక స్కోరింగ్ మూవ్ తో గెలిచాడు. 

తొలి పీరియడ్ లో కీర్గిస్థాన్ రెజ్లర్ కి పాసివిటీ వార్నింగ్ ఇచ్చిన తరువాత కూడా కీర్గి రెజ్లర్ పాయింట్ స్కోరు చేయలేకపోవడంతో తొలి పాయింట్ ను సాధించాడు బజరంగ్. పుష్ డౌన్ ద్వారా కీర్గిస్థాన్ రెజ్లర్ స్కోర్ ని సమం చేసినప్పటికీ... తొలి పీరియడ్ ముగిసేస సమయానికి నెక్ గ్రిప్ ద్వారా రెండు పాయింట్లను సాధించి 3-1 తో లీడ్ లోకి వెళ్ళాడు. 

ఇక రెండవ పీరియడ్ లో ఇద్దరు రెజ్లర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేసారు. 3-3 తో స్కోర్లు సమంతా అయినప్పటికీ... ఒకటే పట్టులో అత్యధిక పాయింట్లు సాధించడం వల్ల భజరంగ్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్స్ లో ఇరాన్ రెజ్లర్ తో భజరంగ్ తలపడనున్నాడు. 

ఉదయం జరిగిన భారత రెజ్లర్ సీమ బిస్లా తొలి రౌండ్ లో ట్యునీషియా రెజ్లర్ సారా చేతిలో ఓటమిని చవిచూసింది. 50 కేజీల విభాగంలో జరిగిన ఈ మ్యాచులో సీమ ఆది నుండి ఒకింత డిఫెన్సివ్ మోడ్ లోనే కనిపించింది. 

భారత రెజ్లర్ సీమ బిస్లా తొలి పీరియడ్ ఆరంభంలోనే పాసివిటీ వల్ల 1 పాయింట్ ను కోల్పోయింది. ఆ తరువాత సారా హంది మరొక పుష్ అవుట్ సాధించి 0-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆ తరువాత పీరియడ్ లో సీమ ఒక పాయింట్ ని సాధించినప్పటికీ... ట్యునీషియా రెజ్లర్ మరో పాయింట్ ను సాధించి సీమకు అవకాశం లేకుండా విజయం సాధించి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది.  ఇక ఇప్పుడు ట్యునీషియా రెజ్లర్ గనుక ఫైనల్స్ లోకి దూసుకెళ్తే సీమ కు రెపఛాజ్ అవకాశం దక్కనుంది. 

click me!