‘‘మేం క్షమించాం.. కానీ’’: సర్ఫరాజ్ వ్యాఖ్యలపై డుప్లిసెస్ కామెంట్స్

By sivanagaprasad kodatiFirst Published Jan 25, 2019, 11:54 AM IST
Highlights

పాక్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అతనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు సైతం వెల్లువెత్తాయి. 

పాక్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అతనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు సైతం వెల్లువెత్తాయి. దీనిపై సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పాడు.

‘‘మ్యాచ్ సందర్భంగా అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరాడు. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు, ఎవరెనీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచర క్రికెటర్లను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తా’’నంటూ సర్పరాజ్ ట్వీట్ చేశాడు.

దీనిపై సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లిసిస్ మాత్రం సర్ఫరాజ్‌కు క్షమిస్తున్నామని ప్రకటించాడు. ‘‘అతను తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. అతనిని మేం మన్నిస్తున్నామన్నాడు. మ్యాచ్ సందర్భంగా బాల్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణిస్తున్న ఫెలుక్‌వాయో పట్ల అసహనంతో ఉన్న సర్ఫరాజ్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఓరేయ్ నల్లోడా..మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చొంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకుని వచ్చావు’’ అంటూ ఉర్దూలో అన్న మాటలు స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఫెలుక్‌వాయో నలుపు రంగును ఉద్దేశించే పాక్ కెప్టెన్ ఈ వ్యాఖ్యలు చేశాడంటూ క్రికెట్ ప్రపంచం మండిపడింది.

మరోవైపు ఈ ఘటనపై దక్షిణాఫ్రికా జట్టుకానీ, బోర్డ్‌ కానీ అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యతిరేక వ్యాఖ్యలు కావడంతో అతను దోషిగా తేలిదే పాక్ కెప్టెన్‌కు పెద్ద శిక్షే పడవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. 

‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

click me!