కార్తీక్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా..?

By ramya NFirst Published Feb 7, 2019, 11:22 AM IST
Highlights

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. 

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. క్యాచ్‌ అందుకోవడమే కాకుండా సిక్స్‌ను అడ్డుకున్నాడు. బౌండరీ లైన్‌ వద్ద కార్తీక్‌ చేసిన ఈ ఫీట్‌కు మైదానంలోని వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

హార్దిక్‌ పాండ్యా వేసిన 16వ ఓవర్‌ చివరి బంతిని కివీస్‌ అరంగేట్ర ఆటగాడు డెరిల్‌ మిచెల్ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఆ దిశలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న దినేష్‌ కార్తీక్‌ బంతిని చాకచక్యంగా అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోతున్నట్లు భావించిన కార్తీక్‌.. బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు.

 కానీ ఈ క్యాచ్‌పై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం ప్రకటించే వరకు దినేష్‌ కార్తీక్‌ స్పష్టం చేయలేకపోయాడు. బంతి అందుకునే సమయంలో.. విడిచే సమయంలో మళ్లీ అందుకునే సమయంలో అతను బౌండరీ లైన్‌ను తాకలేదని సమీక్షలో స్పష్టం కావడంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో డెరిల్‌ విచెల్‌ నిరాశగా వెనుదిరిగాడు.

click me!