''వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''

By Arun Kumar PFirst Published Oct 22, 2018, 7:51 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోనీ...క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ధనా ధన్ షాట్లతో భారత జట్టుకు ధోనీ ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. బ్యాట్ మెన్ గానే కాకుండా కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా కూడా రాణిస్తూ భారత్ ఎన్నో విజయాలు అందించాడు.  కెప్టెన్ కూల్ గా సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం, హెలికాప్టర్ షాట్లతో ధనా ధన్ ఇన్నింగ్స్ లు ఆడటం, చివరి నిమిషంలో ఆటతీరును మార్చే ఇన్నింగ్స్ ఆడటం ధోనీకే చెల్లింది. 
 
అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ధోనీ వేగం తగ్గింది. పరుగులు సాధించడంలో, భారీ ఇన్నింగ్స్ నెలకొల్పడంలో విపలమవుతున్నాడు. దీంతో కొందరు ధోనీ ఇక క్రికెట్ కు గుడ్ పై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటూ గతంలో కొందరు ఉచిత సలహాలిచ్చిన విషయం తెలిసిందే. అతడిని ప్రపంచ కప్ ఆడించకపోవడం మంచిదంటూ కూడా వ్యాఖ్యానించారు. 

అయితే ధోనీ రిటైర్ మెంట్ పై వస్తున్న వార్తలపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డివిలియర్స్ స్పందించాడు. ధోనీ లాంటి అద్భుతమైన ఆటగాన్ని తప్పించాలనుకునేవారు ఓ సారి అతడి రికార్డులను చూడాలని డివిలియర్స్ సూచించారు. అతడిని జట్టు నుండి తప్పించాలని  తాను ఎప్పుడూ కోరుకోనని అన్నారు. అంతేకాదు ధోనీ 80ఏళ్ల వయసులో వున్నా తన ఆల్ టైమ్ ఎలెవన్స్ డ్రీం టీంలో స్థానం కల్పిస్తానని అన్నారు. ధోని వీల్ చైర్ పై వచ్చి బ్యాటింగ్ చేసినా అధ్భుతాలు సృష్టించగలడనే నమ్మకం తనకుందని డివిలియర్స్ వెల్లడించారు. 

click me!