స్పిన్నర్ కేదార్ జాదవ్ కు షాకిచ్చిన ధోనీ

Published : Feb 04, 2019, 08:07 AM IST
స్పిన్నర్ కేదార్ జాదవ్ కు షాకిచ్చిన ధోనీ

సారాంశం

బౌలర్లకు సలహాలు ఇచ్చే సమయంలో ధోనీ సాధారణంగా హిందీలో మాట్లాడుతుంటాడు. అయితే, ఆదివారంనాడు జరిగిన మ్యాచులో కేదార్ జాదవ్ కు ధోనీ మరాఠీ భాషలో సలహాలు ఇచ్చాడు.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పై జరిగిన ఐదో వన్డే మ్యాచులో స్పిన్నర్ కేదార్ జాదవ్ ను టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆశ్చర్యపరిచాడు. వికెట్ల వెనక ఉంటూ ఎప్పటికప్పుడు ధోనీ బౌలర్లకు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాడు.

బంతిని ఎలా వేయాలి, ఎంత వేగంతో వేయాలనే విషయాలు చెబుతుంటాడు. గత ఏడాదిగా కేదార్ జాదవ్ టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్ పై జరిగిన ఐదో వన్డేలో ధోనీ చేసిన ఓ పనికి కేదార్ జాదవ్ ఆశ్చర్యచకితుడయ్యాడు.

బౌలర్లకు సలహాలు ఇచ్చే సమయంలో ధోనీ సాధారణంగా హిందీలో మాట్లాడుతుంటాడు. అయితే, ఆదివారంనాడు జరిగిన మ్యాచులో కేదార్ జాదవ్ కు ధోనీ మరాఠీ భాషలో సలహాలు ఇచ్చాడు. ధోనీ మరాఠీలో మాట్లాడడంతో జాదవ్ తో పాటు జట్టు సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. 

ఈఘటనపై కేదార్ ఓ ట్వీట్ చేశాడు. విదేశీ పర్యటనల్లో ధోనీ ఉంటే స్వదేశంలో ఉన్నట్టే ఉంటుందని అన్నాడు. అయితే ఈసారి మాత్రం ధోనీ నిజంగానే ఆశ్చర్యపరిచాడని  అన్నాడు.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే