విదేశీ యువతిపై ఫ్రెండ్ అత్యాచారం... స్టార్ క్రికెటర్‌పై సస్పన్షన్ వేటు

First Published Jul 23, 2018, 5:07 PM IST
Highlights

కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడంటూ దనుష్కపై లంక క్రికెట్ బోర్డు సీరియస్ అయి వేటు వేసింది.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆ దేశపు క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. దీనితో పాటు కేసు విచారణ పూర్తయ్యే వరకు టెస్ట్ మ్యాచ్‌ ఫీజుపై కోత విధించింది

కొన్ని సార్లు ఎవరో చేసిన తప్పుకు మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక ప్రస్తుతం అలాంటి పరిస్ధితినే ఎదుర్కొన్నాడు. అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆ దేశపు క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. దీనితో పాటు కేసు విచారణ పూర్తయ్యే వరకు టెస్ట్ మ్యాచ్‌ ఫీజుపై కోత విధించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో శ్రీలంక క్రికెట్ జట్టు టెస్టు సిరీస్‌ ఆడుతోంది.

దీనిలో భాగంగా గుణతిలక కొలొంబోలో తాను బస చేసిన హోటల్‌కు తన స్నేహితుడితో పాటు ఇద్దరు విదేశీ యువతులను తీసుకొచ్చాడు. అయితే నార్వేకు చెందిన ఓ యువతి గుణతిలక స్నేహితుడు తనపై అత్యాచారం జరిపాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు గుణతిలక స్నేహితుడిని అరెస్ట్ చేయగా.. దనుష్క మీద మాత్రం ఎటువంటి ఆరోపణలు లేవని తెలిపారు.

అయితే కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడంటూ దనుష్కపై లంక క్రికెట్ బోర్డు సీరియస్ అయి వేటు వేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం ఆటగాళ్లు అర్థరాత్రి లోపే హోటల్ గదులకు చేరుకోవాలి.. అతిథులను గదులకు ఆహ్వానించకూడదు. మరోవైపు గుణతిలక గతంలో పలుమార్లు సస్పెన్షన్‌కు గురయ్యాడు.. ప్రాక్టీస్ సెషన్‌ను ఎగ్గొట్టడం.. రాత్రి సమయాల్లో పార్టీలకు ఎక్కువ సమయం కేటాయించడం వంటి ఆరోపణలతో మ్యాచ్‌ల నిషేధంతో పాటు మ్యాచ్‌ ఫీజులో సైతం కోత విధించారు. 
 

click me!