‘దంగల్’ స్టార్ గీతా ఫోగట్ సోదరి రితికా ఫోగట్ ఆత్మహత్య... ఫైనల్‌లో ఓటమిని జీర్ణించుకోలేక...

Published : Mar 18, 2021, 03:31 PM IST
‘దంగల్’ స్టార్ గీతా ఫోగట్ సోదరి రితికా ఫోగట్ ఆత్మహత్య... ఫైనల్‌లో ఓటమిని జీర్ణించుకోలేక...

సారాంశం

మహావీర్ ఫోగట్ అకాడమీలో ఐదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల రితికా ఫోగట్... భరత్‌పూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ చేరిన రితికా... ఫైనల్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఓడడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య...

అమీర్ ఖాన్, ఫాతిమా సనా ఖాన్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘దంగల్’ సినిమా ద్వారా ఫోగట్ సిస్టర్స్ గురించి ప్రపంచమొత్తానికి తెలిసింది. గీతా, బబితాలతో ఫోగట్ కుటుంబానికి చెందిన అరడజను మంది అమ్మాయిలు రెజ్లింగ్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు.

17 ఏళ్ల రితికా ఫోగట్ మహావీర్ ఫోగట్ అకాడమీలో ఐదేళ్లుగా శిక్షణ తీసుకుంటోంది. భరత్‌పూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఆమె మంచి ప్రతిభ కనబర్చి, ఫైనల్ కూడా చేరింది. అయితే మార్చి 14న జరిగిన ఫైనల్‌లో ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది రితికా ఫోగట్.

ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఆమె, సొంత గ్రామమైన బలాలిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 15న రితికా ఆత్మహత్య చేసుకోగా, 16న ఆమె మృతదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించారు పోలీసులు. అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత రితికా ఫోగట్ మరం విషయం లేటుగా బయటి ప్రపంచానికి తెలియడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !