రెడ్ డెవిల్స్ వైట్ టీమ్‌ను చిత్తు చిత్తు చేశారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెల్జియం 2-0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో నాల్గవ స్థానానికి పరిమితమైపోయింది.
రెడ్ డెవిల్స్ వైట్ టీమ్‌ను చిత్తు చిత్తు చేశారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెల్జియం 2-0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో నాల్గవ స్థానానికి పరిమితమైపోయింది. ఈడెన్ హజార్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆట ఆరంభమైన నాల్గవ నిముషానికే మిడ్ ఫీల్డర్ థామస్ మునీర్ ఫస్ట్ గోల్ చేసి బెల్జియం టీమ్‌కు 1-0 ఆధిక్యాన్ని సంపాదించి పెట్టాడు. ఆ విధంగా ప్రపంచకప్ టోర్నీలో తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య గేమ్ నువ్వా నేనా అన్న తీరుగా హోరాహోరీగా సాగుతూనే ఉంది. మునీర్ గోల్ చేసిన తర్వాత ఒక్క గోల్ కూడా చేయకుండానే ఫస్టాఫ్ ముగిసింది.
సెకండాఫ్ కూడా ఇలాగే ముగిసిపోతుందా అని గ్యాలరీల్లో ప్రేక్షకులు భావించారు. ఒక్క గోల్‌తోనే బెల్జియం థర్డ్ ప్లేస్ కొట్టేస్తుందని అనుకున్నారు. ఇరు జట్ల మధ్య గేమ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పటికీ చూస్తున్న వారిలో ఒక పక్క టెన్షన్.. మరో పక్క ఇంగ్లండ్ ఓడిపోతుందనే ప్రెడిక్షన్. ఎట్టకేలకు 82వ నిముషంలో మిడ్ ఫీల్డర్ ఈడెన్ హజార్డ్ ఫీల్డ్ గోల్ చేశాడు. బెల్జియంకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆట ముగిసే సమయానికి 2-0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై బెల్జియం విజయం సాధించింది. ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో థర్డ్ ప్లేస్ సంపాందించింది.