గ్రీజ్మన్ సూపర్.. సెమీస్‌కు ఫ్రాన్స్..!

First Published 7, Jul 2018, 10:28 AM IST
Highlights

అండర్ డాగ్ అంటే ఇలా ఉండాలి. చడీ చప్పుడూ లేకుండా రావాలి. జరుగుతుంది ఏమిటో అర్థం కాక ప్రత్యర్థులు కన్ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు గోల్స్ కొట్టేయాలి. సెమీస్‌లో బెర్త్ కొట్టేయాలి. శుక్రవారంనాటి మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఇలాగే రాణించింది.

హైదరాబాద్: అండర్ డాగ్ అంటే ఇలా ఉండాలి. చడీ చప్పుడూ లేకుండా రావాలి. జరుగుతుంది ఏమిటో అర్థం కాక ప్రత్యర్థులు కన్ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు గోల్స్ కొట్టేయాలి. సెమీస్‌లో బెర్త్ కొట్టేయాలి. శుక్రవారంనాటి మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఇలాగే రాణించింది. ఉరుగ్వేపై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇంతటి ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆంటోయినె గ్రీజ్మన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఫస్టాఫ్ చాలావరకు అంత ఇంట్రస్టింగ్‌గా సాగలేదు. గ్యాలరీల్లో ప్రేక్షకులు నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు. రెండు జట్లు గోల్ పోస్టులపైన దాడులు చేస్తున్నప్పటికీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఇలా గేమ్ జీడిపాకంలా సాగుతూనే ఉంది. సరిగ్గా 40వ నిముషం ఫ్రాన్స్‌కు కలిసొచ్చింది. గ్రీజ్మన్ బలంగా కొట్టిన ఫ్రీ కిక్‌ను డిఫెండర్ రఫెల్ హెడర్‌తో నెట్‌లోకి పంపించాడు. జట్టుకు ఫస్ట్ గోల్ అందించాడు. ఫస్టాఫ్ ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యంతో నిలిచింది.
సెకండాఫ్ కూడా హోరాహోరీగా పోరు సాగింది. ఫస్ట్ గోల్ దక్కడంలో మెయిన్ రోల్ ప్లే చేసిన గ్రీజ్మన్ 61వ నిముషంలో గోల్ చేశాడు. ఫ్రాన్స్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు.  ప్లేయర్స్ టీమ్ స్పిరిట్ ఫ్రాన్స్‌కు ఎంతగానో ఉపకరించింది. ఉరుగ్వే టీమ్‌కు కాళ్ళూ చేతులూ కట్టేసినంత పనైంది. ఫ్రాన్స్ టీమ్‌ను సెమీ ఫైనల్‌కు పంపించింది.

Last Updated 7, Jul 2018, 10:28 AM IST