
Ajit Agarkar: బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ ఎంపికైన సంగతి తెలిసిందే. చేతన్ శర్మ స్థానంలో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా నియమించారు. సెలెక్షన్ ప్యానల్ లోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ ప్యానెల్ అగార్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ట్విటర్ లో వెల్లడించింది.
ఇక, అజిత్ అగార్కర్ పూర్తి పేరు అజిత్ భాల్‌చంద్ర అగార్కర్. ఆయన టీమిండియా తరుపున 1998లో అరంగ్రేటం చేసిన 2007 వరకు ప్రాతినిధ్యం వహించారు. అజిత్ అగార్కర్ వన్డే ఫార్మాట్‌లో స్పెషలిస్ట్ ప్లేయర్. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతను కూడా సభ్యుడు. అదే సమయంలో అతను టెస్ట్ క్రికెట్‌లో కూడా అనేక చిరస్మరణీయ ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పేరు మీదుగా ఎన్నో రికార్డులు ఉన్నాయి, అవి నేటికీ అన్ బ్రేకేబుల్ గానే ఉన్నాయి. ఆయన భారత బ్యాట్స్‌మెన్‌గా వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిట ఉంది.అతని క్రికెట్ కెరీర్‌లో అనేక రికార్డులు నమోదు చేశారు.
ముంబై రంజీ జట్టులో అద్భుత ప్రదర్శన ఇచ్చి టీమిండియాలో స్థానం దక్కించుకున్నారు. అజిత్ అగార్కర్ వన్డే క్రికెట్‌లో శుభారంభం చేశాడు. తొలుత 1 ఏప్రిల్ 1998న అతను కొచ్చిలో ఆస్ట్రేలియాపై తన ODI అరంగేట్రం చేసాడు. తన బౌలింగ్ తో ప్రత్యార్థులకు చుక్కులు చూపించేవాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టి రికార్డు క్రియేట్ చేశారు. కేవలం కేవలం 23 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 1998లో నెలకొల్పిన ఈ రికార్డును శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్ 2009లో బద్దలు కొట్టాడు. 2005-06లో అజిత్ అగార్కర్ టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యమైన ఫాస్ట్ బౌలర్ అయ్యాడు.
తన 9 ఏండ్ల క్రికెట్ ప్రస్తానంలో చేరుగని ముద్రవేసుకున్నారు. తన కెరీర్ లో 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఆయన తన రిటైర్మెంట్ తరువాత కొన్నిరోజులు ముంబై జట్టుకు ప్రధాన సెలెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఐసీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించారు. అనంతరం కామెంటరీ ప్రొఫెషన్ లోనూ అగార్కర్ తనదైన ముద్ర వేసుకున్నారు.
'క్రిక్‌బజ్' ప్రకారం..ఇంతకుముందుకు చీఫ్ సెలెక్టర్ గా పని చేసిన వారికి రూ.90 లక్షల నుంచి రూ. కోటి పారితోషికంగా చెల్లించేవారంట. కానీ.. నూతనంగా నియమితులైన అజిత్ అగార్కర్ మాత్రం భారీ మొత్తంలోనే పారితోషకం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఆయనకు వార్షిక వేతనంగా రూ. కోటి నుంచి రూ.3 వరకు చెల్లించే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది.
సెలెక్టర్ కు తక్కువ జీతం కారణంగా కొంతమంది పెద్ద ఆటగాళ్ళు ఈ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడలేదని, ఇంతకుముందు ఇలాంటి వార్తలు తెరపైకి వచ్చాయి. తక్కువ జీతం కారణంగా.. వీరేంద్ర సెహ్వాగ్ చీఫ్ సెలెక్టర్ పదవిని తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని చీఫ్ సెలక్టర్ జీతాన్ని బీసీసీఐ పెంచింది. అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా బీసీసీఐ నుంచి ఏటా కోటి నుంచి రూ.మూడు కోట్ల వరకు అందుకోనున్నారు.