హాలిడే ట్రిప్ లో.. తీవ్రంగా గాయపడిన మాజీ క్రికెటర్

By ramya neerukondaFirst Published Oct 8, 2018, 10:06 AM IST
Highlights

 అదృష్టవశాత్తు ప్రాణపాయం తప్పినా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణపాయం తప్పినా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత శుక్రవారం హెడెన్‌ ఫ్యామిలీతో కలిసి క్వీన్స్‌లాండ్‌ దీవులకు హాలిడే ట్రిప్‌ వెళ్లాడు. అక్కడ స్ట్రాడ్‌బ్రోక్‌ ఐస్‌ల్యాండ్‌లో  తన కొడుకు జోష్‌తో కలిసి సరదాగా సర్ఫింగ్‌ గేమ్‌ ఆడాడు. అయితే ఈ ఆటలో పట్టుకోల్పయిన హెడెన్‌ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తల బోటును ఢీకొట్టడంతో తీవ్రగాయలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

ఇక ఈ విషయాన్ని హెడేనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాలతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘జోష్‌తో సర్ఫింగ్‌ చేస్తూంటే గాయమైంది. కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండాలి. నా మంచి కోరిన నా శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు నా తలకు, మెడకు గాయాలయ్యాయని, మెడలోని సీ6, సీ5, సీ4 లిగమెంట్స్‌ విరిగినట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటాను.’అని పేర్కొన్నాడు. ఆసీస్‌ తరపున 103 వన్డేలు, 161 టెస్ట్‌లు, 9 టీ20లాడిన హెడెన్‌ 2009లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్ట్‌  2008లో భారత్‌తో తన చివరి వన్డే ఆడాడు. 

click me!