మెల్బోర్న్ టెస్టు: 435 పరుగుల వెనుకంజలో కంగారూలు

By pratap reddyFirst Published Dec 27, 2018, 7:59 AM IST
Highlights

భారత్ ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసి తన తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. రోహిత్ శర్మ 63 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. పుజారా సెంచరీ చేయగా, కోహ్లీ 82 పరుగులు చేసి అవుటయ్యాడు. 

రెండో రోజు గురువారం ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. హరీష్ 5 పరుగులతో, ఆరోన్ ఫించ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా భారత్ తొలి ఇన్నింగ్సుపై 435 పరుగుల వెనుకంజలో ఉంది.

ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులను 7 వికెట్ల నష్టానికి 443 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసింది. రోహిత్ సర్మ 63 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు, స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు. హాజిల్ వుడ్, లయన్ లకు తలో వికెట్ దక్కాయి.

ఆస్ట్రేలియాపై జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 443 పరుగుల వద్ద జడెజా రూపంలో భారత్ ఏడో వికెట్ ను కోల్పోయింది. జడేజా 4 పరుగులు మాత్రమే చేసి హాజిల్ వుడ్ బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు రిషబ్ పంత్ 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్కార్క్ కు చిక్కాడు. 

రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అతను 62 బంతుల్లో యాభై పరుగులు చేశాడు. తద్వారా గత కొంత కాలంగా తనపై వస్తున్న విమర్శలకు ఆయన బ్యాట్ ద్వారా సమాధానం చెప్పాడు.

భారత్ 361 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహానే 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లయన్ బౌలింగులో పెవిలియన్ కు చేరుకున్నాడు.

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 293 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. వికెట్ల వద్ద గోడలా నిలబడిన ఛతేశ్వర్ వుజారా కూడా ఆ తర్వాత కొద్దిసేపటికే అవుటయ్యాడు. అతను 106 పరుగులు చేసి కమిన్స్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 299 పరుగుల వద్ద నాలుగో వికెట్ జారవిడుచుకుంది.

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.  మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో ఛతేశ్వర్‌ పుజారా సెంచరీ చేశాడు. 

రెండోరోజు గురువారం లైయన్‌ వేసిన 113వ ఓవర్‌ మొదటి బంతిని ఫోర్‌గా మలచడం ద్వారా పుజారా 281 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. 

తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన పుజారా క్రీజులో కుదురుకుని ఆసీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కుంటున్నాడు. భారత కెప్టెన్ విరాట్‌కోహ్లీ పుజారాకు మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. అతను అర్థ సెంచరీ చేశాడు.

టెస్టుల్లో పుజారాకు ఇది 17వ సెంచరీ. లంచ్‌ విరామ సమయానికి భారత్‌ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 277 పరుగులు.

click me!