ఆసియా పారా గేమ్స్‌ 2023 : పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో హానీకి బంగారు పతకం..

By SumaBala Bukka  |  First Published Oct 25, 2023, 11:03 AM IST

పురుషుల జావెలిన్ థ్రో ఎఫ్3/38 ఈవెంట్‌లో హానీ బంగారు పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో 11 స్వర్ణాలు పడ్డాయి. 


హాంగ్‌జౌ : భారత పారా అథ్లెట్ హానీ హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2023లో 11వ బంగారు పతకాన్ని సాధించాడు. 55.97మీటర్ల దూరం విసిరి అద్భుతమైన రికార్డుతో ఆకట్టుకున్నాడు. భారత్ కు పారాఆసియా గేమ్స్ లో 11వ బంగారు పతకాన్ని అందించాడు. 

అంతకుముందు పారా అథ్లెట్ సుమిత్ యాంటిల్ హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2023లో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. బుధవారం 25 అక్టోబర్ 2023 నాడు ఈ ఘనత సాధించాడు సుమిత్. 

Latest Videos

సుమిత్ 73.29 మీటర్లు విసిరి కొత్త ప్రపంచ, పారా ఏషియన్, గేమ్స్ రికార్డులను నెలకొల్పి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ తరువాతి స్థానంలో పుష్పేంద్ర సింగ్ నిలిచాడు. అతను జావెలిన్ ను 62.06 మీటర్లు బలంగా విసిరి కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా, పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తుంది. పోటీల తొలి రోజు సోమవారం 6 స్వర్ణాలతో పాటు 17 పతకాలతో శుభారంభం చేసింది భారత్. రెండో రోజు మంగళవారం మూడు పసిడి సహా 17 పతకాలు భారత్ తన ఖాతాలో వేసుకుంది.ఇప్పటివరకు 9 స్వర్ణాలతో సహా మొత్తం 34 పథకాలు భారత్ సొంతం చేసుకుంది.  

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కూడా ఈ ఆటల్లో తమ సత్తా చాటుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆటగాడు రవి రొంగలి  షాట్ పుట్ లో  రజతం సాధించాడు. ఎఫ్ 40  కేటగిరీలో రవి  గుండును 9.92 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణ అట్లేట్ జీవాంజి దీప్తి పారా ఆసియా క్రీడల్లో అదరగొట్టింది.  మహిళల టీ20 400 మీటర్ల పరుగులో ఆసియా క్రీడలు, పారా ఆసియా క్రీడల  రికార్డును బద్దలు కొట్టింది. 56.69 సెకండ్లలో  నిర్ణీత పరుగును పూర్తి చేసి స్వర్ణ పథకం కైవసం చేసుకుంది దీప్తి. . ఈ పోటీ మంగళవారం జరిగింది.

click me!