ఏషియన్ గేమ్స్ 2023: బ్యాడ్మింటన్‌లో మొట్టమొదటి స్వర్ణం... చరిత్ర సృష్టించిన రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి..

ఏషియన్స్ గేమ్స్ 2023 పోటీల్లో స్వర్ణం నెగ్గిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి.. వరల్డ్ నెం.1 బ్యాడ్మింటన్ పురుషుల జోడిగా రికార్డు..

Google News Follow Us

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జోడి  సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి... స్వర్ణం గెలిచి, సరికొత్త శకాన్ని లిఖించారు. పురుషుల డబుల్స్ ఫైనల్‌లో కొరియాకి చెందిన చో సోల్గూ, కిమ్ వోంగూతో జరిగిన మ్యాచ్‌లో 21-18, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకున్నారు  సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి... ఏషియన్ గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్‌లో భారత్‌కి దక్కిన మొట్టమొదటి గోల్డ్ మెడల్ ఇదే. 

అంతకుముందు సెమీ ఫైనల్‌లో మలేషియా జోడిపై నెగ్గి, ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఫైనల్‌ చేరిన మొట్టమొదటి  భారత బ్యాడ్మింటన్ జోడిగా చరిత్ర సృష్టించారు సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి. 

ఈ ఏడాది సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడికి ఇది మూడో బంపర్ విజయం. ఇంతకుముందు ఇండోనేషియా సూపర్ 1000 ఓపెన్‌తో పాటు బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్స్ కూడా గెలిచారు సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి... ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌తో వరల్డ్ నెం.1 మెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీగా నిలిచింది సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి.